టీవీ9  సంస్థ నుంచి కొత్తగా వచ్చిన టీవీ9 భారత్‌ వర్ష్‌ అప్పుడే వివాదాల్లోకి వెళ్తోంది. తాజాగా ఆ ఛానల్ పై ఎన్నికల సంఘం మండిపడింది. మరి ఈసీకి అంతగా ఎందుకు కోపం వచ్చిందంటే.. వీవీ ప్యాట్లు మాయం అయ్యాయంటూ భారత్ వర్ష్ చానల్ ఓ స్టోరీ టెలికాస్ట్ చేసింది. 


ఈ కథనం ఈ సీ దష్టికి వెళ్లింది. వివరాలను పరిశీలించిన ఈసీ.. ఇది సాక్ష్యాధారాలు లేని కథనంగా అభిప్రాయపడింది. టీవీ9 భారత్ వర్ష్ పై మండిపడింది.  ప్రజలకు తప్పుడు సమాచారం అందిస్తున్నారని, సాక్ష్యాధారాల్లేని వార్తలు వ్యాప్తి చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈవీఎంలకు, వీవీ ప్యాట్లకు ఎంతో భద్రత ఉంటుందని ఈసీ చెబుతోంది. 

ఈవీఎంల రవాణా అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య, సునిశిత నిఘా నీడలో సాగుతుందని ఈసీ చెబుతోంది. అలాంటప్పుడు ఆధారాల్లేకుండా వార్తలు రాయడం సమంజసం కాదని హితవు పలికింది. మరోసారి ఇలా తప్పుడు రిపోర్టింగ్ చేయొద్దంటూ మందలించింది. 

టీవీ9 గ్రూపు నుంచి కొన్ని నెలల క్రితం ఈ భారత్‌ వర్ష్ ఛానల్ ప్రసారాలు ప్రారంభించింది. ఈ ఛానల్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీ కూడా వచ్చారు. ఆరంభంలోనే ఇలాంటి వివాదాల్లోకి వెళ్తున్న భారత్‌ వర్ష్.. ఇక ముందు ముందు ఎలాంటి కథనాలు ఇస్తుందో.



మరింత సమాచారం తెలుసుకోండి: