ఏపీలో ఎవరు గెలుస్తారు అనే అంశంపై ప్రధాని మోడీ కూడా క్లారిటీకి వచ్చినట్టున్నారు. తాజాగా హర్యానా పర్యటనలో ఆయన ఈ ఇష్యూపై ఇంట్రస్టింగ్ కామెంట్లు చేశారు. కొన్నిరోజులుగా సీఎం చంద్రబాబు ఈవీఎంలు, వీవీ ప్యాట్ల అంశంపై తన పోరాటాన్ని తీవ్రతరం చేయడంపై మోదీ సెటైర్లు పేల్చారు. 


ప్రస్తుతం దేశంలో ఎవరికి అనుకూల పవనాలు వీస్తున్నాయో తెలిసిన తర్వాత చంద్రబాబు ఈవీఎంలపై పడ్డారని విమర్శించారు. చంద్రబాబు తీరు చూస్తుంటే క్రికెట్ లో కొన్నిసార్లు అవుటైన బ్యాట్స్ మెన్ అంపైర్ ను తప్పుబట్టినట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. తన పరిస్థితికి ఎన్నికల సంఘంపై నిందలు మోపుతున్నారంటూ చంద్రబాబుపై మోదీ విమర్శలు చేశారు.

తాజాగా ఈ విమర్శలు చూస్తుంటే.. ఏపీలో జగన్‌ గెలుపు ఖాయం అని మోడీ అంచనాకు వచ్చినట్టే అనుకోవాలి. గాలి జగన్ వైపే ఉందని మోడీ మాటల ద్వారా అర్థమవుతోంది. తొలి మూడు విడతల పోలింగ్ సమయంలో తనను దూషించడానికే చంద్రబాబు అధిక ప్రాధాన్యత ఇచ్చారని మోదీ అంటున్నారు. 

చంద్రబాబు కొన్నిరోజులుగా ఈ వీఎం ఇష్యూపై పోరాడుతున్న సంగతి తెలిసిందే. తనతో పాటు మరో 21 పార్టీల నాయకులను కలుపుకుని సుప్రీం కోర్టుకు కూడా వెళ్లారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా ఇలా స్పందించారు. మొత్తానికి ఏపీకి కాబోయే సీఎం జగనే అని మోదీ అంచనాకు వచ్చారన్నమాట.



మరింత సమాచారం తెలుసుకోండి: