భారత ప్రధాని నరేంద్రమోదీ మరోసారి టైమ్ మేగజైన్ కవర్ పేజీపై కనిపించారు. ఆయన గతంలో 2015లో టైమ్ మ్యాగజైన్ కవర్ పేజీపై కనిపించారు. అప్పట్లో మోదీ భారత్‌కు ఎంత విలువై వ్యక్తో వివరిస్తూ ప్రశంసించారు. కానీ ఈసారి మాత్రం మోదీపై వివాదాస్పద కథనాలు టైమ్ లో వచ్చాయి. 


ఈ మేగజైన్లో మోడీ గురించి రెండు వ్యాసాలు ఉన్నాయి. 'ఇండియాస్ డివైడర్ ఇన్ చీఫ్' అనే పేరుతో ఉన్న వ్యాసం విమర్శనాత్మకంగా ఉంది. దీన్ని భారత జర్నలిస్టు తవ్లీన్ సింగ్ తనయుడు ఆతిష్ తసీర్ రాశారు. 'మోదీ ది రిఫార్మర్' పేరుతో ఉన్న మరో కథనం మోదీకి అనుకూలంగా ఉంది. 

భారత్ లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న తరుణంలో టైమ్ మ్యాగజైన్ మోదీపై కథనాలు ప్రచురించింది. ఇప్పుడు ఈ కథనాలు రాజకీయంగానూ అస్త్రాలుగా మారుతున్నాయి. మోదీ ఎలాంటివాడో, అతడి ఆలోచనలు ఎలా ఉంటాయో టైమ్ మ్యాగజైన్ వెల్లడించిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జేవాలా విమర్శలు ఎక్కుపెట్టారు.

'విభజించు, పాలించు' అనేది బ్రిటీష్ వాళ్ల సిద్ధాంతం అంటున్న సూర్జేవాలా..  అప్పట్లో దేశాన్ని పట్టి పీడించిన బ్రిటీష్ వాళ్లను కాంగ్రెస్ తరిమికొట్టిందని గుర్తు చేశారు. ఇప్పుడు మరోసారి బ్రిటీష్ వారి అడుగుజాడల్లోనే నడుస్తున్న మోదీని కూడా అదేరీతిలో గద్దె దింపుతాం అని సూర్జేవాలా కామెంట్ చేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: