Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, May 23, 2019 | Last Updated 4:10 pm IST

Menu &Sections

Search

సక్సెస్ స్టోరి : ప్రపంచ వ్యాప్తంగా 80 కోట్ల మంది జీవితాల్లో వెలుగు నింపడమే ధ్యేయమంటున్న డా.శ్రీజారెడ్డి సరిపల్లి – సీఈఓ, పినాకిల్ బ్లూమ్స్ నెట్ వర్క్

సక్సెస్ స్టోరి : ప్రపంచ వ్యాప్తంగా 80 కోట్ల మంది జీవితాల్లో వెలుగు నింపడమే ధ్యేయమంటున్న డా.శ్రీజారెడ్డి సరిపల్లి – సీఈఓ, పినాకిల్ బ్లూమ్స్ నెట్ వర్క్
సక్సెస్ స్టోరి : ప్రపంచ వ్యాప్తంగా 80 కోట్ల మంది జీవితాల్లో వెలుగు నింపడమే ధ్యేయమంటున్న డా.శ్రీజారెడ్డి సరిపల్లి – సీఈఓ, పినాకిల్ బ్లూమ్స్ నెట్ వర్క్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఏదయినా ఇబ్బంది మనదాకా వస్తే కానీ తెలియదంటారు, అదే ఆరోగ్యపరమయిన ఇబ్బంది,అందులోనూ ప్రపంచంలోనే ఎవ్వరికీ అంతుపట్టని - కారణమేమిటో తెలియని ఆరోగ్య పరమయిన ఇబ్బంది అంటే గుండె గుభెల్లుమంటుంది. దానిలోనూ ఆ ఇబ్బంది పిల్లలకు సంబంధించినదయితే ఆ కుటుంబ పరిస్థితి గుండెని తరిగేస్తుంది. ఆ కోవకు చెందినదే మానసిక రుగ్మతలు, న్యూరలాజికల్ కండీషన్స్...ఆటిజం స్పెక్ట్రం డిజార్డర్, హైపర్ యాక్టివిటీ డిజార్డర్ (ADHD), సెరబ్రల్ పాల్సీ, ఫోబియాలు, సూసైడ్ టెండెన్సీలు, అతి భయాలు, ఇంకా మరెన్నో…వీటన్నింటికి కారణమేమిటనేది ఎంతో అభివృద్ది చెందిన ఈ నవయుగ మేథస్సుకు కూడా అంతు చిక్కడం లేదు ఈ నాటికి కూడా వీటికి ఎటువంటి మందులు లేవు.  

Dr. Sreeja Reddy Saripalli - CEO Pinnacle Blooms Network - Empowering 80 crore lives

ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 80 కోట్ల మంది పిల్లలు, పెద్దలు కారణం తెలియని, మందులు లేని మానసిక రుగ్మతలు, న్యూరలాజికల్  కండీషన్లతో బాధ పడుతున్నారు. వీరి కోసం ఏం చేయడానికయినా, ఎంత ఖర్చు పెట్టడానికయినా సిద్దంగా ఉండి కూడా ఏమి చేయలేని పరిస్థితులలో ఉన్న వారి కుటుంబాలలో వెలుగులు నింపడమే తమ ధ్యేయమంటున్నారు పినాకిల్ బ్లూమ్స్ నెట్ వర్క్ సంస్థాపక సీఈవో డా. శ్రీజారెడ్డి సరిపల్లిగారు.  మే11 వారి జన్మదినం, వారి సంస్థ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వారిఎక్సక్లూసివ్ ఇంటర్వ్యూ...


ప్ర. అస్సలు పినాకిల్ బ్లూమ్స్ నెట్ వర్క్ అంటే ఏమిటి?
డా. శ్రీజగారు: ప్రపంచ వ్యాప్తంగా 80 కోట్ల మంది పిల్లలు, పెద్దలు కారణం తెలియని, మందులు లేని వివిధ న్యూరలాజికల్ కండీషన్స్ మరియు మానసిక రుగ్మతలతో బాధపడుతున్న80 కోట్ల మంది జనజీవన స్రవంతిలో భాగమై తమకంటూ ఒక జీవితాన్ని పొందడానికి వారి వారి కుటుంబాల ముందు  ఉన్న అత్యుత్తమ దారి థెరపీ, రిహాబిలిటేషన్.  అంటే వారి ఇబ్బందిని పూర్తిగా తీసివేయలేక పోయినా…ఆ ఇబ్బందితోనే మిగిలిన వారితో కలవగలగడం, వారి పనులు వారు చేసుకోగలగడం, వారి కుటుంబ సభ్యులతో మెలగగలగడం నేర్పించడం…ఇది ఒక యజ్ఞం, దేవుని  ప్రతిమను తయారు చేసేటపుడు శిల్పికి ఉన్నంత అంకిత భావవం కావాలి.   

Dr. Sreeja Reddy Saripalli - CEO Pinnacle Blooms Network - Empowering 80 crore lives

ఈ పనికి సంబంధించిన దాదాపు అయిదు నుండి ఏడు రంగాల వారు అవసరమవుతారు. వారందరూ కలిసి సమిష్టిగా పనిచేస్తేనే, కుటుంబం యొక్క సంపూర్ణ సహకారం ఉంటేనే ఈ కారణం తెలియని, మందులు లేని రుగ్మతలకు సమాధానం చెప్పగలిగేది. అటువంటి అనుభవజ్ఞలయిన నిపుణులు, ఎన్విరానిమెంట్, సేవా ధృక్పదంతో కూడిన తల్లి స్పర్శ వంటి మంచిని కలుగ చేసేదే పినాకిల్ బ్లూమ్స్ సెంటర్.  పరిపూర్ణచైల్డ్ డెవలెప్ మెంట్ మరియు పెద్దల మానసిక రిహాబిలిటేషన్ సెంటర్.  ఒక్కొక్క సెంటర్ లో ఒక 100 నుండి 200 మంది మందికి మాత్రమే సర్వీసు ఇవ్వగలము. మరి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 80 కోట్ల మందిరికి సర్వీసు ఇవ్వాలంటే.. .ఇలాంటి అనేక సెంటర్లు సమాహారమే పినాకిల్బ్లూమ్స్ నెట్ వర్క్.


ప్ర:  ఆటిజంతో ఇబ్బంది పడుతున్న పిల్లలు, బాధపడుతున్న కుటుంబాలు పినాకిల్ లో అత్యుత్తమ ఫలితాలు పొందుతున్నారు. స్వాంతన దొరుకుతుంది వారికి..పినాకిల్ యొక్క ప్రత్యేకత ఏమిటి?
డా. శ్రీజగారు: ప్రతి బిడ్డ ప్రత్యేకం, వారి కుటుంబ పరిస్థితులు, జీవిన శైలి ప్రత్యేకం, వారికి పై-పై మెరుగులు దిద్దడం కాకుండా సమస్య లోతుల్లోకి వెళ్లి మూలాలను కదిలిస్తేనే దీర్ఘకాలిక ప్రయోజనాలు సిద్దిస్తాయి.  

Dr. Sreeja Reddy Saripalli - CEO Pinnacle Blooms Network - Empowering 80 crore lives

పినాకిల్ లో మల్టీ డిసిప్లేనరీ-ఇంటిగ్రేటెడ్ థెరపీ అప్రోచ్ ను ఫాలో అవుతాము.  అంటే ప్రతి బిడ్డను ఆ సెంటర్లో ఉన్న వివిధ రంగాల్లో నిష్ణాతులయిన నిపుణులు గమనించి వివిధ ధృక్కోణాల్లో వారికి థెరపీ ఇవ్వడం.అనుభవం, నైపుణ్యం, ప్రావిణ్యం, వీటన్నింటినీ మించి తల్లిదండ్రుల బాధను అర్థం చేసుకొని వారి మానసిక స్థైర్యాన్ని పెంచటం, పిల్లలకు కావాల్సిన థెరపీని అందిస్తూనే...అమ్మకు  కావాలసిన శిక్షణ అందించి అమ్మనే తన బిడ్డకు థెరపిస్టుగా తయారు చేయడం. 


పిల్లలకు పూర్తి సౌకర్యవంతమయిన, అహ్లాదకరమయిన, నిర్భయమయిన ఇంటి మాదిరి వాతావరణాన్ని కల్పించి మిగిలిన పిల్లలతో మమేకం చేసే ప్లే-ఫుల్   ఇన్–డైరెక్ట్థెరపీ...ప్రతి పిల్లాడు, పాప తమకంటూ ఒక జీవితాన్ని ఏర్పరచుకోగల స్థాయికి రావాలని కోరుకునే మా 120 మందిపైగా ఉన్న సిబ్బంది తపన, తాపత్రయం.


ప్ర. పినాకిల్ బ్లూమ్స్ సెంటర్లలో ఎటువంటి - ఏయే సర్వీసులు అందజేస్తున్నారు?
డా.శ్రీజ గారు :  ఇందాక మనమనుకున్నట్లు ప్రతి బిడ్డ ప్రత్యేకం, ప్రతి వ్యక్తి మానసిక, న్యూరోలాజికల్ కండీషన్ ప్రత్యేకం. పినాకిల్ లో మేము ప్రతి బిడ్డ, ప్రతి వ్యక్తి పరిస్థితిని నిర్ధిష్టరీతిలో అంచనా వేసి వారికొరకు ప్రత్యేకమయిన థెరపీ, డెవలప్ మెంట్, రిహాబిలిటేషన్ కార్యక్రమాన్ని రూపొందించి, నెలవారి గోల్స్ నిర్ణయించి రోజువారి 1:1 థెరపీలను అందిస్తాము.


ఆటిజం థెరపీ, స్పీచ్ థెరపీ, ఆక్యూపేషనల్ థెరపీ, బిహెవియరల్ థెరపీ, సైకలాజికల్ కౌన్సిలింగ్, స్పెషల్ ఎడ్యూకేషన్, డ్యాన్స్ థెరపీ, మ్యూజికల్ థెరపీ, యోగా థెరపీ, హైడ్రో థెరపీ, ఫిజియో థెరపీ, గ్రూప్ టీచింగ్, పేరెంట్ ట్రైయినింగ్, టీచర్ ట్రైయినింగ్, స్కూల్ ట్రైయినింగ్ తో పాటుగా అన్ని రకములయిన అస్సెస్ మెంట్లు, మానసిక రుగ్మతలు, న్యూరోలాజికల్ కండీషన్స్ కు సంబంధించిన సర్టిఫైడ్ కోర్సులను అందజేస్తున్నాము.


ప్ర. అస్సలు పినాకిల్ లాంటి సంస్థ ఏర్పాటు చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది?
డా.శ్రీజ గారు : మేము, మా కుటుంబం ప్రాక్టికల్ గా అనుభవించిన బాధ, అదే కారణం పినాకిల్ అనే యజ్ఞాన్ని మేము మొదలు పెట్టడానికి, మా అబ్బాయి చి.సంహిత్ రెడ్డి 2 సంవత్సరముల వయస్సులో ఆటిజం అని చెప్పారు.  డబ్బు–పేరు-ఇన్ ఫ్లూయన్స్ అన్నీ ఉండి కూడా ఏమీ చేయలేని పరిస్థితి అన్పించింది.  అయితే చివరకు అది వినికిడి ఇబ్బంది అని తెల్సుకున్నాం… బాబుకుకాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ చేయించాము.  ఇప్పుడు సంహిత్ కు ఐదేళ్లు...దేవ - దేవుడు శ్రీవెంకటేశ్వరస్వామి వారి దయవలన అంతా బాగుంది. 

Dr. Sreeja Reddy Saripalli - CEO Pinnacle Blooms Network - Empowering 80 crore lives

అయితే ఈ బాధ - కష్టాల నుండి కుటుంబాలకు, పిల్లలకు స్వాంతన కలిగించే పటిష్ఠమయిన సంస్థలేవీ మన భారత దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా లేవని…కానీ ఈ కారణం చెప్పలేని న్యూరాలాజికల్ కండీషన్స్, మానసిక రుగ్మతలు రోజు - రోజుకీ పెరుగుతున్నాయని మాకు అర్థం అయ్యింది.  


ప్రతి బిడ్డకూ మంచిగా జీవించే హక్కు ఉంది. ప్రతి కుటుంబం యొక్క కలలను నిజం చేయాలనే సంకల్పం మాకుంది అదే మా పినాకిల్ బ్లూమ్స్ నెట్ వర్క్ సంస్థ ఆరంభానికి…దిన-దినాభివృద్దికి కారణం.


ప్ర: 80 కోట్ల మంది అంటే మాటలు కాదు..వారందరికీ ఎలా సర్వీసు ఇవ్వాలనుకుంటున్నారు?
డా.శ్రీజ గారు  :  మా మొట్టమొదటి సెంటరు హైదరాబాదులో మొదలు పెట్టక ముందు రెండున్నర సంవత్సరముల పాటు దాదాపు 30+ మెంబర్ల టీమ్ రీసెర్చ్, ఇన్నోవేషన్ ఫలితంగా మిరాకిల్ అనే బహుశా ప్రపంచంలోనే మొట్ట మొదటి మానసిక రుగ్మతలు, న్యూరాలాజికల్ కండీషన్స్ కు సంబంధించిన టెక్నాలజీ ఫ్లాట్ ఫామ్ ను తయారు చేసుకున్నాం.

Dr. Sreeja Reddy Saripalli - CEO Pinnacle Blooms Network - Empowering 80 crore lives

ఆర్టిఫిషయిల్ ఇంటెలిజెన్స్, మెషన్ లెర్నింగ్ ఆధారిత క్లౌడ్ సాంకేతిక పరిజ్ఞానం… స్మార్ట్ ఫోన్ ద్వారా ఒకటి కాదు పది వేల సెంటర్ల ప్రభావవంతమయిన పనితీరు, ప్రతి బిడ్డకు సంబంధించిన థెరపీ పూర్తి వివరాలు, ప్రతి తల్లిదండ్రుల యొక్క సంతృప్తి మరియు ప్రతి ఒక్క థెరపీ కి సంబంధించిన పూర్తి వివరాలు థెరపిస్టు ఇవ్వడం వరకూమేము ఉన్న చోట నుండే పర్యవేక్షించగలం...


దేవుని పేరుమీద మేము పినాకిల్ ఆలోచన చేసిన మొదటి రోజు నుండే మా ఆలోచన ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 80 కోట్ల మంది భాద్యతను తీసుకొని వారి - వారి కుటుంబాలలో వెలుగులు నింపడమే…మేము దీనికి పూర్తి సన్నద్ధతో ఉన్నాం.  దేవ - దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దయవలన పినాకిల్ బ్లూమ్స్ నెట్ వర్క్ భారత దేశం నుంచి మొదలైవిశ్వవ్యాపితమవుతుంది.


ప్ర : ఈ రంగంలో ఫ్రాంచైజీ కాన్నెప్ట్ ను మీరొక్కరే అందజేస్తున్నారట?
డా.శ్రీజ గారు :  ఆకలి బాధ తెలిసినవారు పగవారిని కూడా పస్తు పడుకోబెట్టరనేది మన పెద్దలు చెప్పే నానుడి.  అలాగే మానసిక రుగ్మత, న్యూరోలాజికల్ కండీషన్లతో బాధపడుతున్న పిల్లలు- పెద్దల కుటుంబాలను ఈ బృహత్తర కార్యక్రమంలో భాగం చేయడమనేదే ఈ ఫ్రాంచైజీ యొక్క ముఖ్య ఉద్దేశ్యం.  భారత దేశ వ్యాప్తంగా 7,000సెంటర్లు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో మనసా–వాచా-కర్మణా పనిచేస్తున్నాం.  ఈ ఫ్రాంజైజీలకు డాక్టర్లు, హాస్పిటల్స్ కూడా అర్హులే. ఆసక్తి గల వారు మా నేషనల్ కేర్ నంబర్ 9100 181181లేదా మా [email protected]సంప్రదించగలరు.

Dr. Sreeja Reddy Saripalli - CEO Pinnacle Blooms Network - Empowering 80 crore lives

ప్ర. మీరు చేస్తున్న ఈ బృహత్ ప్రయత్నంలో ప్రభుత్వ పాత్ర ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారు?
డా.శ్రీజ గారు : సమస్య గురించి అవగాహన కలిగి - సమస్య ఏమిటో తెలుసుకుంటే సమస్యకు సగం సమాధానం కలిగినట్లే.  ఆటిజం, ADHD, సైకలాజికల్ ప్రాబ్లెమ్స్, కాగ్నిటల్ డెవలెప్ మెంటల్ ఇబ్బందుల గురించి పల్లెటూళ్లలోనిచదువుకోని వారికే కాదు...నగరాల్లోనివిద్యావంతులకు కూడా అవగాహన లేదు.

Dr. Sreeja Reddy Saripalli - CEO Pinnacle Blooms Network - Empowering 80 crore lives

అందుకే పినాకిల్ బ్లూమ్స్ నెట్ వర్క్ టార్చ్-బేరర్ ప్రోగ్రామ్ ని ప్రారంభించింది.  ఆన్ లైన్లో , అప్లికేషన్లలో వివిధ రకములయిన మానసిక రుగ్మతలు, న్యూరోలాజికల్ కండీషన్లు గురించి స్వియ శిక్షణ కోర్సులు ప్రారంభించాం.  రాష్ట్రంలో- దేశంలో- ప్రపంచంలో ఎక్కడ నుండయినా ఆ కోర్సులు నేర్చుకోవచ్చు.  అంతే కాదు వారికి వెరిఫైయబుల్ సర్టిఫికెట్ ను కూడా ఇస్తున్నాం.  ఇవి అన్ని పూర్తి గా ఉచితం.  ఈ ఇబ్బందుల గురించి సమాజానికి ఎంత అవగాహన ఉంటే ఆ ఇబ్బందితో బాధపడుతున్న వారికి, వారి కుటుంబాలకు అంత ఉపశమనం..అలాగే స్కూల్ టీచర్ల కోర్సు తీసుకుంటు స్కూల్లో ఆ పిల్లలకు అంత సౌకర్యం.


మేము రాష్ట్ర - కేంద్ర ప్రభుత్వాలకు ఈ కోర్సులు మరియు ఈ టెక్నాలజీని ఎటువంటి ధనాపేక్ష లేకుండా ఇవ్వడానికి సిద్దంగా ఉన్నాము.  ప్రతి టీచరు ఈ కోర్సులు నేర్చుకోవాలని.. ప్రభుత్వం సూచనల చేయగలిగితే కారణం తెలియని ఇబ్బందులతో బాధపడుతున్న చిన్నారుల జీవితాలు బాగుపడతాయి. 


మా వంతు ప్రయత్నంగా మేము మా సంపాదనలో 33% ను సేవా ఫౌండేషన్ ద్వారా పేదవారయిన పిల్లల బాగోగుల కోసం వెచ్చిస్తున్నాము.  ఒక్క ఏప్రియల్ నెలలో - ఒక్క హైదరాబాద్ లోనే దాదాపు డెబ్బై మంది పిల్లలకు సేవా ఫౌండేషన్ ద్వారా మంచి చేయగలిగాము.  తెల్ల రేషన్ కార్డు లేక 25 వేల కన్నా తక్కువ నెలసరి జీతం ఉన్నవాళ్లు అర్హులు.


నువ్వు దేని గురించయితే బాధ్యత తీసుకుంటావో - దానికి నీవే యజమానివి అన్న వివేకానంద మాటలను ఊటంకిస్తూ.. ప్రపంచ వ్యాప్తంగా 80 కోట్ల మంది - వారి కుటుంబాల్లో వెలుగులు నింపాలన్న మీ ఆకాంక్ష మీరు నమ్ముకున్న ఆ దేవ దేవుడు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సాక్షిగా నెరవేరాలని  కోరుకుంటున్నాము..నమస్తే.


Dr. Sreeja Reddy Saripalli - CEO Pinnacle Blooms Network - Empowering 80 crore lives
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అసెంబ్లీ, లోక్ సభ్ ఎన్నికల ఫలితాలు 2019 : లైవ్ అప్ డేట్స్
లక్ష ఓట్ల పైగా మెజారిటీతో దుమ్ము రేపుతున్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి!
జగన్ కి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి ఆశిస్సులు ఫలించాయా!
తెలంగాణలో తొలి ఫలితం వెల్లడి.. మెదక్‌లో కొత్త ప్రభాకర్ విజయం!
తలెక్కడ పెట్టుకోవాలో అర్థం అవుతుందా రాజగోపాల్!
బాబోరి రియల్ సత్తా..తెదేపా ఆల్ టైమ్ వరస్ట్ @ 19?
వైయస్ఆర్సీపీ ఘనవిజయం వెనక అత్యంత కీలకంగా వ్యవహరించింది వీరే!!
పరిటాల శ్రీరామ్ పాయే?
వైసీపీ @ 150
తెలంగాణ లో కేసీఆర్ ఎదురీత?
రవ్వంతయినా మారని రేవంత్ రెడ్డి పరిస్థితి?
మోదీ హవా దేశమంతగా..మోదీ నేమో వెనుకంజ?
కుప్పంలో బాబోరి ఎదురీత!
చింతలపూడి చింతమనేనికి మూఢీ!
పవన్ కళ్యాన్ పాయే..!
దూసుకు పోతున్న వైసీపీ, బీజేపీ, టీఆర్ఎస్?
మల్కాజ్‌గిరి ఎమ్మెల్యేకి తీవ్ర గాయాలు!
ఫోటో ఫీచర్ : విజయవాడలో ముందుగానే మొదలయిన వైసీపీ సంబురాలు
ఒడిశా కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిపై దాడి..పరిస్థితి విషమం!
పోలీస్ బందోబస్తు, ఆంక్షల నడుమ  ప్రారంభంకానున్న ఓట్ లెక్కింపు
షూటింగ్ పూర్తి చేసుకున్న 'డ్రీమ్ బాయ్'
అమ్మో సమంత..ఏకంగా 100 కిలోలు
కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి మార్పులేదు!
కర్నూల్ లో టీడీపీ నేత దారుణ హత్య!
గాలి జనార్థన్ పిల్ల చేష్టలు..మామిడి చెట్టెక్కి కొంటెపనులు!
12 రోజులు..30 సిమ్ కార్డులు..ఏందిది రవి ప్రకాశా..!
దటీజ్ కేసీఆర్..!
వావ్ ‘సాహూ’ప్రభాస్ లుక్ అదుర్స్!
ఎగ్జిట్ పోల్స్ ఎఫెక్ట్: ఊపందుకున్న షేర్ మార్కెట్
ఘోరం : శిశువు తల లభ్యం - మొండెం ఎక్కడ ?
జ‌గ‌న్‌కే జ‌నామోదం.. ఎందుకంటే..?
బాబు నిలిచేనా..జ‌గ‌న్ గెలిచేనా!
ప్రమాదమా..నిర్లక్ష్యమా? చిత్తూరు ఇవిఎం స్ట్రాంగ్ రూమ్ ల వద్ద మంటలు...!
ఐసీసీ ప్రపంచకప్ లో అంబటి రాయుడుకి చుక్కెదురే!
విజయ్ దేవరకొండకి ‘హీరో’తో మరో హిట్ ఖాయమా!
విశ్వక్ సేన్ `కార్టూన్` చిత్రం ప్రారంభం
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.