తెలుగుదేశం అధ్యక్షుదు నారా చంద్రబాబు నాయుడు జీవితాశయం ప్రధాని నరేంద్ర మోడీని మళ్ళా అధికార పీఠానికి చేరువలోకి రాకుండా చూడటం మాత్రమే. ఆయన వ్యక్తిగత ఆగ్రహాన్ని ఒక ఆరని జ్వాలగా మార్చి పగతీర్చుకోవటమే తప్ప వేరే ప్రయోజనాలు ఆయనకు దక్కేలా లేవు. ఎందుకంటే ఎన్నికల పలితాలు ఆయనకు ధారుణ పరాభవం కలిగిస్తాయి తప్ప మరేమీ అద్భుతం జరగదని దేశ వ్యాప్త సర్వేల పలితాలు చెపుతున్నాయి.   


అది గ్రహించిన చంద్రబాబు తన ఆ గర్భ శత్రువు మోడీకి అధికార పీఠం దక్కరాదని అందుకు చేసే ప్రయత్నమే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో చర్చలు. ఫలితం గా ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యూహానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బ్రేకులు వేశారు. లోకసభ ఎన్నికల ఫలితాల వెల్లడికి ముందే ఈ నెల 21 వ తేదీన విపక్షాల సమావేశం నిర్వహించాలని నారా చంద్రబాబు నాయుడు తలపెట్టారు. 
Mamata Banerjee opposes 21 meeting proposed by Chandrababu
విపక్షాలన్నీ కలిసి ఒక ఉమ్మడి వ్యూహాన్ని రచించుకుని ఢిల్లీ పీఠాన్ని దక్కించు కోవడానికి ముందస్తు కార్యాచరణకు నడుం బిగించాలనేది రాహుల్ గాంధి, చంద్రబాబుల సంయుక్త వ్యూహంగా కనిపించింది. అయితే, ఈ నెల 21వ తేదీన సమావేశాన్ని మమతా బెనర్జీ వ్యతిరేకించారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు తో మమతా ఆ విషయం సూటిగానే చెప్పారు. గురువారం రాత్రి ఇరువురు ముఖ్యమంత్రులు ముఖాముఖి చర్చలు జరిపారు. ఇరువురు నేతలు 45 నిమిషాల పాటు జాతీయ రాజకీయాల గురించి మాట్లాడినట్లు టీడీపి నేత కంభంపాటి రామ్మోహనరావు చెప్పారు. ఫలితాలు వెలువడడానికి రెండు రోజుల ముందు ప్రతిపక్షాల సమావేశం జరగాలనే ప్రతిపాదనపై ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. 


ఈవీఎంల భద్రతపై దృష్టి సారించాల్సి ఉన్నందున సమావేశాన్ని వాయిదా వేయాలని మమతా బెనర్జీ చంద్రబాబుతో చెప్పినట్లు సమాచారం. ఇతర పార్టీలతో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు చెప్పారు. ప్రధాని పీఠంపై కన్నేసిన మమతా బెనర్జీ వ్యూహాత్మకంగా 21 వ తేదీ సమావేశాన్ని వ్యతిరేకించినట్లు ప్రచారం జరుగుతోంది.
Image result for mamata rahul chandrababu
మమత బెనర్జీకి తెలుసు చంద్రబాబు రాజకీయ మూలాలు రాష్ట్రంలో కదిలిపోయాయని, అందుకే కేంద్రంలో ప్రతిపక్ష ఐఖ్య కూటమి కోసం తహతహ లాడుతున్నాడని.  ఒక వైఫల్య నాయకత్వంతో ముందుకు సాగాలని తను అనుకోకపోవటంతో ఏదో ఒక మిషతో చంద్రబాబును, అవసరమైతే తన జీవితాశయమైన ప్రధాని పదవికి అడ్డు రాగలడు అన్న రాహుల్ గాంధిని కూడా దూరం పెడుతూవస్తున్నారు.   

ఏక్షణాన ఏవ్యూహం పన్ని రాజకీయ సన్నివేశాన్ని తనకనుకూలంగా మలుచుకునే తత్వమున్న చంద్రబాబును మమత తొలినుంచీ అనుమానాస్పదంగానే చూస్తుంది. అవసరమైతే శత్రువు ప్రధాని నరెంద్ర మోడీతోనైనా ఏమరుపాటుగానైనా పొత్తుపెట్టుకోగలదేమో గాని, ప్రాణంపోయినా చంద్రబాబుతో అప్రమత్తంగానే వ్యవహరిస్తుంద నేని కాలం చెపుతున్న వాస్తవం. 




మరింత సమాచారం తెలుసుకోండి: