కేంద్రంలో మరోసారి మోడీ సర్కారు ఏర్పాటయ్యే అవకాశాలు చాలావరకూ తగ్గిపోతున్నాయి. అదే సమయంలో కాంగ్రెస్ కు కూడా పరిస్థితి అనుకూలంగా లేదు. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలే దేశ ప్రధానిని నిర్ణయించే పరిస్థితి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 


ఈ సమయంలో అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ రెండూ కూడా.. సాధ్యమైనంతవరకూ  అన్ని పార్టీలతోనూ సత్సంబంధాలు నెరిపే ప్రయత్నాలు చేస్తున్నాయి. యూపీఏ 3పై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ అందుకు మార్గాలు సిద్ధం చేస్తోంది. గతంలో యూపీఏ 2 సార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన సమయాల్లో ఏపీలో ఆ పార్టీకి బలమే కొండంత అండగా ఉంది. 

కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉంది. తెలంగాణలో కాస్త ఉనికి ఉన్నా.. ఏపీలోఅయితే మరీ దారుణం. అందుకే ఇక్కడ కేసీఆర్, జగన్‌లను దువ్వేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. గతంలో జగన్ ను బాగా ఇబ్బంది పెట్టిన కాంగ్రెస్ ఇప్పుడు ఆయనతో దోస్తీ ప్రతిపాదన చేయాలంటేనే ఇబ్బందిపడుతోంది.

అందుకే ఈ పనికి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ప్రయోగిస్తోందని వార్తలు వస్తున్నాయి. ప్రణబ్ అయితేనే కాస్త వ్యవహారం చక్కబెట్టగలరని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోందట. మరి ప్రణబ్ రాయబారం ఎంతవరకూ సక్సస్ అవుతుందో. అటు కేసీఆర్ వద్దకు చిదంబరం వంటి నేతలను పంపుతోందట. 



మరింత సమాచారం తెలుసుకోండి: