రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అలాంటి మరో అద్భుత దశ్యం ఆవిష్కారమవుతుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇన్నాళ్లూ జగన్, కేసీఆర్ కుమ్మక్కై తనను ఇబ్బందిపెడుతున్నారని చంద్రబాబు చెప్పిన చంద్రబాబే.. వారిద్దరూ వేదిక పంచుకునే అవకాశం కనుచూపు మేరలో కనిపిస్తోంది. 


వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏకు గడ్డు పరిస్థితి తప్పదని అంచనాలు వస్తున్న నేపథ్యంలో కేసీఆర్ కాంగ్రెస్ పైవు చూస్తున్నారని తాజాగా కథనాలు వస్తున్నాయి. అదే నిజమైతే.. ఆయన తన స్నేహితుడు జగన్ ను కూడా కాంగ్రెస్ గూటికే చేరుస్తారు. అందులో సందేహం లేదు. 

కానీ ఇప్పటికే కాంగ్రెస్ దగ్గర చంద్రబాబు ఉన్నాడు. యూపీఏలో  చేరకపోయినా రాహుల్ ను డైరెక్టు చేస్తూ నడిపిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. మరి ఇప్పుడు కేసీఆర్, జగన్ కాంగ్రెస్ వైపు వస్తే.. ఈ ముగ్గురు దిగ్గజాలూ ఒకే గూటికి చేరినట్టే అవుతుంది. 

అలాంటప్పుడు.. ఎవరిది పైచేయి అవుతుందన్న సందేహాలు రాకమానవు. చంద్రబాబుతో పోలిస్తే.. జగన్, కేసీఆర్ ఇద్దరూ సంపాదించే ఎంపీ సీట్లు ఎక్కువ. సీట్ల లెక్కల ప్రకారం జగన్, కేసీఆర్ మాటే చెల్లుతుంది. అయితే అన్నిసార్లు సీట్లే డిసైడ్ చేయవు. రాహుల్ వద్ద పలుకుబడి ఉపయోగించి చంద్రబాబే కూటమిలో కీలక పాత్ర పోషించొచ్చు. ఏదేమైనా ఈ ముగ్గురూ ఒకచోట చేరితే రాజకీయం మహా రంజుగా ఉండదూ..



మరింత సమాచారం తెలుసుకోండి: