ఏమరుపాటుగా ఉన్నప్పుడు వెనక నుండి వీపు పై వెసే వేటే వెన్నుపోటు – ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు కళ్ళారా, చెవులారా వీక్షించిన, విన్న ఉదంతమే “వెన్నుపోటు” వెన్నుపోటు అంటే ఎవరికైనా ఎన్టీఆర్ — వెన్నుపోటు ఉదంతమే గుర్తొస్తుంది. కానీ ఇది తప్పు.  చంద్రబాబు కెరీర్ లో వెన్నుపోటు ఇదొక్కటే కాదు.  ఆయన రాజకీయ ప్రస్థానమే వెన్నుపోట్ల మయం. అవకాశం దొరికి నప్పుడల్లా వివిధ రాజకీయ పార్టీల్ని తొక్కుకుంటూ అధికారంలోకి వచ్చారాయన.

Image result for NTR Backstabbed by chandrababu

పోకిరి సినిమాలో విలన్ ప్రకాష్ రాజ్ అన్నట్లు నేను అందరిలా కష్టపడి పైకి రాలేదు తొక్కుకుంటూ అణచివేస్తూ ఆక్రమిస్తూ పైకి వచ్చాను. అలాగే నమ్మకంతో పొత్తుపెట్టు కున్న ఏ పార్టీనైనా తొక్కుకుంటూ ఆక్రమిస్తూపైకి వచ్చింది చంద్రబాబు తెలుగుదేశం. ఇది జగద్విదితం.  ఇప్పుడా క్రమం లోని వెన్నుపోట్లు అన్నీకలిసి అనకొండలై చంద్రబాబును చుట్టేస్తూ విషం చిమ్ముతూ తమ ప్రభావం చూపిస్తున్నాయి. అతడి రాజకీయ జీవిత పతనానికి పునాది రాళ్లుగా మారుతున్నాయి. బాబు చరిత్ర తెలిసిన వాళ్లెవరూ ఇప్పుడు అతడ్ని దరిదాపులకు రానీయడంలేదు. రానిచ్చినా ఏదో వంకతో వదిలివేస్తున్నారు 


అసలు ఇప్పటివరకు ఆయనను భుజస్కంధాలపై పెట్టుకొని మోసిన పచ్చమీడియా బ్రతుకు ఉభయ రాష్ట్రాల్లో పలుచనైపోతోంది. బహుశ చందా కాలం ముగిసిన వారు ఇక ఆ చందా పునరుద్ధరించరని ప్రజల్లో ప్రబలంగా ప్రచారంలో ఉంది. రీడర్షిప్ చూస్తే గత సంవత్సరానికి నేటికి తెలుగు ప్రధాన పత్రిక అమ్మకాల్లో పెద్ద పెరుగుదల కనిపించ టం లేదు. మిగిలిన వాటికి అసలు భవిష్యత్ ఉండే అవకాశాలే లేవు. అవి ఒక కులం ఒక పార్టీ పత్రికలుగా బ్రాండింగ్ అయిపోయాయి. దుర్యోధనునికి  జలస్థంబన విధ్యలో నైపుణ్యం ఉన్నట్లు, చంద్రబాబుకు మీడియా మానేజ్మెంటులో నిపుణత ఉంది. ఇప్పుడు దానికి అంత్యకాలం దాపురించిందని ఆ రెండు పత్రికలకు తెలంగాణలో ఎదురు గాలి వీస్తుందని సమాచారం.  


దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి తరచుగా ఉదహరించిన   రెండు పత్రికల పాఠకుల సంఖ్య ధారుణంగా పడిపోవచ్చని విశ్లేషకులు బల్లగుద్ది చెర్పుతున్నారు. టివి 9 నుండి రవిప్రకాష్ వెలివేత టిడిపికి ఆ కులానికి వెన్ను విరిచినట్లే . అన్నట్లు  పచ్చ మీడియా అంతర్జాల చానళ్ళు అన్నీ ఇప్పటికే శరవేగంగా వేల సంఖ్యలో. మూతపడి పోతున్నాయి.  చంద్రబాబును ఒక అపర చాణక్యునిలా ప్రొజెక్ట్ చేసిన ఆ చానళ్లు కనీసం కనుచూపులో కూడా కనిపించట్లేదు.  పత్రికలు, మీడియా చానళ్లు, ప్రచారం, పొగడ్తలు, సామాజికవర్గం ఇవీ చంద్రబాబు పంచప్రాణాలు. ఎన్నికల పలితాలు వస్తే సామాజికవర్గం తప్ప మిగిలినవన్నీ దూరమైపోవటం తధ్యమని రాజకీయంగా ఆయన నడ్డి విరగటం ఖాయమని అంటున్నారు.  


జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతానంటూ చంద్రబాబు చేసుకుంటున్న సొంత ప్రచారం కేవలం రాష్ట్రానికే పరిమితం. జాతీయ స్థాయిలో అతడ్ని ఎవరూ “కింగ్ -మేకర్” లా చూడడంలేదు. కొన్ని పార్టీ లైతే బాబును తమ రాష్ట్రంలో ప్రచారానికి కూడా పిలవడం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇదంతా చంద్రబాబు స్వయంకృతాప రాధం. జాతీయ స్థాయిలో తనింత అపనమ్మకాన్ని ప్రోది చేసుకోవటానికి ప్రధాన కారణం గతంలో పొడిచిన వెన్నుపోట్లే కారణం.

Image result for federal front a dream vs mahakutami the real

ప్రతి ఎన్నికలకు ఒక పార్టీతో పొత్తుపెట్టుకోవడం చంద్రబాబుకు అలవాటు. అలా పొత్తు లేక పోతే ఆయన గెలవలేరు. అలా అని ఆయన ఆ పొత్తుల్ని కొనసాగించరు. అవసరం తీరిన తర్వాత కూరలోంచి కరివేపాకును తీసేసినంత సులభంగా  తీసి పడేస్తారు. ఇప్పటికే ఎన్నో రాజకీయపార్టీలకు ఇది అనుభవం. తాజాగా బీజేపీ రెండవ సారి చంద్రబాబు వెన్నుపోటు అనుభవాన్ని రుచి చూసింది.


ఈ నేపథ్యంలో చంద్రబాబుతో పొత్తు పెట్టుకునేందుకు జాతీయ స్థాయిలో ఏ పార్టీ కూడా ముందుకు రావడంలేదు. ప్రస్తుతం చంద్రబాబు ప్రచారం చేస్తున్న పార్టీలు కూడా, అతడ్ని కేవలం ప్రచారానికే పరిమితం చేస్తున్నాయి తప్ప, భవిష్యత్తు రాజకీయకోణంలో ఆయన్ను లెక్కల్లో పరిగణించట్లేదు. చివరికి కాంగ్రెస్ పార్టీ కూడా చంద్రబాబును వ్యూహాత్మక భాగస్వామిగా చూడకుండా అవకాశవాద రాజకీయనేతగా మాత్రమే చూస్తోంది. అంటే వాడేసి వదిలేయటానికే ప్రాధాన్యమిస్తుంది.


ఏపీ ఎన్నికల ఫలితాల్లో చంద్రబాబుకు తగినన్ని ఎంపీ సీట్లు వస్తేనే కాంగ్రెస్ లో అతడికి గౌరవం. లేదంటే హస్తం నేతలు చంద్రబాబును అస్సలు పట్టించుకోరు. ఎందు కంటే కంచి గరుడ సేవ ఎవరు చేస్తారు. మరోవైపు బాబు మాత్రం తనపై ఎలాంటి కేసులు పడకుండా ఉండేందు కు కాంగ్రెస్ లాంటి జాతీయపార్టీతో అంటకాగాలని చూస్తున్నారు. కానీ ఈ పొత్తు ఎంతోకాలం కొనసాగదనే విషయం అందరికీ ప్రత్యేకించి, కాంగ్రెస్ వారికి అర్థమౌతూనే ఉంది. ఇలా తన వ్యవహారశైలితో జాతీయస్థాయిలో ఒక్కటంటే ఒక్క పార్టీ మద్దతు కూడా కూడగట్టుకోలేక పోతున్నారు చంద్రబాబు. 


ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు, ఆ తర్వాత వామపక్షాలు, బీజేపీ, టీఆర్ఎస్, చివరికి జనసేనని, ఇప్పుడు మరోసారి బిజేపిని కూడా వెన్నుపోటు పొడిచారు. వాటి ఫలితాన్ని ఆయన త్వరలోనే అనుభవించ బోతున్నారు. రాజకీయంగా ఏకాకిగా మారబోతున్నారు. ఈ వెన్నుపోట్లే చంద్రబాబు రాజకీయ పతనానికి పునాది రాళ్లుగా మారాయని అంటున్నారు అనుభవఙ్జులైన విశ్లేషకులు.


మహాకూటమి నిర్మాణంలో ఆయన చక్రం త్రిప్పుతున్నారని అనేది మన తెలుగు పచ్చ మీడియా ప్రచారం మాత్రమే. చంద్రబాబును ప్రచారం కోసం ఎవరూ పిలవట్లేదని ప్రచారంలో లేకపోతే తనకు ప్రాణవాయువు అందదని - కాబట్టే పిలవని పేరంటానికి వెళ్ళే పనిలేని పేరంటాలులా — కొనసాగుతున్నారని, ఈ మద్య బాబు పట్ల మమత ప్రవర్తనలో తేలిపోతుంది. 

 Image result for ntr politically back stabbed by chandrababu

మరింత సమాచారం తెలుసుకోండి: