గోదావరి జిల్లాల రాజకీయాన్ని కుదుపు కుదిపే వార్త ఇది. ముద్రగడ పద్మనాభం కాపుల డిమాండ్ తో చాలా కాలంగా ఉద్యమం చేస్తూ వస్తున్నారు. ఆయన పోరాటం అంతా అధికార టీడీపీకి వ్యతిరేకంగా జరుగుతూ వస్తోంది. కాపులకు మాట ఇచ్చి టీడీపీ అన్యాయం చేసిందని ముద్రగడ అయిదేళ్ళ బాబు జమానాలో ఎన్నో పోరాటాలు చేశారు. ముద్రగడ తనుకు తాను ఏం సాధించారో తెలియదు కానీ, కాపులను టీడీపీకి దూరం చేయడానికి మాత్రం ఆయన బాగానే ఉపయోగపడ్డారు.


ఇదిలా ఉండగా తాజా ఎన్నికల్లోనూ ముద్రగడ తనదైన రాజకీయం చూపారని అంటున్నారు. ఆయన లోపాయికారిగా వైసీపీకి మద్దతు ఇచ్చారని, ఆ పార్టీ విజయానికి క్రుషి చేశారని కూడా ప్రచారం సాగింది. ఈ నేపధ్యంలో ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తుందని అన్ని సర్వేలు తేల్చేస్తున్న సమయంలో  రాజకీయంగా యాక్టివ్ కావాలని ముద్రగడ డిసైడ్ అయినట్లుగా భోగట్టా. అందుకోసం ఆయన మంచి ముహూర్తం చూసుకుంటున్నరని టాక్.


ఈ నెల 23న ఎన్నికల ఫలితాలు వస్తాయి. వైసీపీ గెలిస్తే ఆయన ఆ పార్టీలో చేరిపోవాలని దాదాపుగా నిర్ణయించేసుకున్నారుట. వైసీపీలో అయితేనే రాజకీయంగా బాగుంటుందని భావించి ఇప్పటికే ఆ పార్టీ నేతలతో టచ్ లోకి వెళ్ళారట. ఇక వారి ద్వారా జగన్ కి కూడా ముద్రగడ చేరిక సమాచారం వెళ్ళిందట. జగన్ సైతం ముద్రగడ చేరికకు పచ్చ జెండా వూపారని అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే గోదావరి జిల్లాల్లో పెద్దాయనగా పిలిచే ముద్రగడ తన రూట్ మార్చుకుంటే మాత్రం చంద్రబాబుకు ఇబ్బందులు రాజకీయంగా తప్పవని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: