చంద్రబాబునాయుడుపై ప్రధానమంత్రి నరేంద్రమోడి తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. మోడి మాట్లాడుతూ చంద్రబాబు అవుటైన బ్యాట్స్ మెన్ అంటూ ఎద్దేవా చేశారు. అవుటైన బ్యాట్స్ మెన్ అంపైర్లను ఎలా విమర్శిస్తుంటారో చంద్రబాబు కూడా ఎలక్షన్ కమీషన్ ను అదే విధంగా విమర్శిస్తున్నట్లు మండిపడ్డారు.

 

మోడి చెప్పినట్లు ఎన్నికల సంఘమే అంపైర్ అయితే మరి ఓటర్ల పాత్ర ఏమిటి అనే చర్చ మొదలైంది. నిజానికి ఓడిపోయినపుడు మాత్రమే చంద్రబాబుకు ఈవిఎంల్లోని లోపాలు గుర్తుకు వస్తాయి. టెక్నాలజీని దేశానికి తానే పరిచయం చేశానని చెప్పుకునే చంద్రబాబు ఈవిఎంల విశ్వసనీయతను మాత్రం తరచూ ప్రస్తావిస్తున్నారు. ఇదే చంద్రబాబు 2014లో గెలిచినపుడు మాత్రం ఈవిఎంల గురించి ఏమీ మాట్లాడలేదు.

 

మొన్నటి పోలింగ్ అయిపోయిన దగ్గర నుండి ఈవిఎంలపైనే కాకుండా ఎలక్షన్ కమీషన్ పైన కూడా ఎలా రెచ్చిపోతున్నారో అందరూ చూస్తున్నదే. తానేసిన ఓటు తన పార్టీకే పడిందా ? తనకే పడిందా ? అని వ్యాఖ్యానించి అందరిలోను పలుచనైపోయారు. అదే రోజు ఓట్లేసిన కోట్లాదిమంది ఓటర్లలో ఏ ఒక్కరికీ రాని అనుమానం కేవలం చంద్రబాబుకు మాత్రమే రావటం విచిత్రంగా ఉంది.

 

అదే విషయాన్ని నరేంద్రమోడి గుర్తుచేశారు. రేపటి కౌంటింగ్ లో తెలుగుదేశంపార్టీ ఓడిపోతే వెంటనే ఈవిఎంలదే తప్పని చంద్రబాబు ఆరోపణలు లేవదీస్తారనే ప్రచారం ఇప్పటికే విస్తృతంగా జరుగుతోంది. చంద్రబాబు మాటలు కూడా దానికి తగ్గట్లే ఉన్నాయి. ఆ విషయాన్నే తాజాగా మోడి కూడా ప్రస్తావించారంతే.


మరింత సమాచారం తెలుసుకోండి: