ఏపీలో ఉప్పు నిప్పులా ఉంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ ఒకే వేదిక మీదకు వచ్చే అవకాశాలు ఉన్నాయా అంటే రాజకీయం తెలిసిన వారెవరూ లేదు అనే చెబుతారు. ఈ ఇద్దరి దారులు వేరు, ఇక్కడ రాజకీయం కంటే మిగిలిన విషయాలు ఎక్కువగా పనిచేస్తున్నాయి. దాంతో అయిదేళ్ళ ఏపీ ఎపిసోడ్ అంతా చూశారు. దాంతో ఇపుడు జగన్ బాబు ఏ విధంగానూ కలిసే అవకాశాలు లేవనే అంటారు.


ఐతే దానికి అవకాశం ఉందని ఇపుడు వార్తలు వస్తున్నాయి. రాజకీయాల్లో ఏదీ కాదు అని చెప్పడానికి వీలు లేదు. అందువల్ల బాబు, జగన్ అందుకు అతీతులు కాదు. అయితే ఎలా ఎక్కడ అన్న ప్రశ్నలకు  సమాధానాలు కూడా ఉన్నాయి. కేంద్రంలో రేపటి రోజున యూపీయే 3 సర్కార్ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ తహతహలాడుతోంది. అందుకోసం ఒకనాటి తన పార్టీ నేతలకు పెద్ద పీట వేస్తోంది. ఓ విధంగా చెప్పాలంటే జగన్ కాంగ్రెస్ వాడే. అందువల్ల ఆయన్ని ఎలాగైనా దువ్వి కాంగ్రెస్ కి మద్దతు తీసుకోవాలని అనుకుంటున్నారు. ఏపీలో మెజారిటీ ఎంపీ సీట్లు జగన్ గెలిసే ఆయన హాట్ ఫేవరేట్ అయిపోతారు.


అదే సమయంలో ముందు నుంచి కాంగ్రెస్ కి మద్దతు ఇస్తున్న చంద్రబాబుని కూడా కాంగ్రెస్ వదులుకోదలచుకోవడంలేదుట. ఈ పరిణామాలు చూసుకున్నపుడు కాంగ్రెస్ వేదికగా డిల్లీలో బాబు జగన్ ఇద్దరూ కలిసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఏపీలో వైసీపీ సర్కార్ ఏర్పాటు చేస్తే కేంద్ర సహాయం జగన్ కి తప్పకుండా అవసరం.  మరో వైపు రాజకీయంగా బాబుని కట్టడి చేయడానికైనా యూపీయే 3లో జగన్ చేరడం అనివార్యం అవుతుందని అంటున్నారు. అలాగే ప్రత్యేక హోదా అన్నది కూడా తెచ్చుకోవాలన్నా జగన్ కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వక తప్పదని అంటున్నారు. మొత్తానికి రేపటి రోజున  హస్తినలో అనూహ్య పరిణామాలు జరిగితే బాబు జగన్ కేంద్రంలో మిత్రులుగా కొనసాగాల్సివుంటుందని అంటున్నారు. చూడాలి. ఏం జరుగుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: