యుద్ధంలో అన్నీ కరెక్టే అన్నది ఓ నానుడి. అలాగే యుద్ధంగా సమాయానికి అనుగుణంగా వ్యూహం రూపొందించుకోకపోతే ఓటమితో కరచాలనం తప్పదు. ఎదుటివాడి బలాలు, బలహీనతలు.. సొంత బలం, బలహీనతలను సరిగ్గా బేరీజు వేసుకుని ప్లాన్ రూపొందించుకోవడంలోనే విజయం సగం లభిస్తుంది. 


రాజకీయాల్లో అంతగా అనుభవం లేని రాహుల్ గాంధీ ఈ విషయంలో విఫలమవుతున్నాడా.. మోడీని మట్టికరిపించాల్సిన సమయంలో సరైన వ్యూహాలు అమలు చేయలేకపోతున్నాడా అన్న సందేహాలు కలుగుతున్నాయి. కేంద్రంలో మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే అందుకు రాహుల్‌గాంధీనే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తాజాగా కామెంట్ ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. 

మోడీకి వ్యతిరేకంగా కూటములు రూపొందించుకోవడంతో రాహుల్ ఫెయిల్ అయ్యారు. ఢిల్లీలో ఆప్‌తో పొత్తు పొనగనివ్వలేదు. దీని వల్ల ఢిల్లీలో బీజేపీ లాభవపడే ఛాన్సు ఉంది. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎస్పీ-బీఎస్పీ కూటమికి వ్యతిరేకంగాపావులు కదుపుతున్నారు. దీని వల్ల కూడా బీజేపీకే లాభం. 
కేరళలో వామపక్షాలకు, పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌కు, దేశ రాజధానిలో ఆప్‌నకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పని చేస్తోందన్న వాదన ఉంది. ఈ అన్ని
రాహుల్ గాంధీ రాజకీయ అపరిపక్వతను, వ్యూహాత్మక తప్పిదాలుగా వర్ణించాల్సి వస్తోంది. ఈ చర్యల వల్ల అంతిమంగా బీజేపీయే లాభపడుతోంది. 

ఈ ఎన్నికల్లో అధికార బీజేపీ పై కాకుండా ప్రతిపక్షాలతో కాంగ్రెస్‌ పోరాడుతోందని కేజ్రీవాల్ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేకపోలేదు. మోదీ-షా ద్వయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకోవడమే మా లక్ష్యం. వారిద్దరికీ తప్ప ఎవరికైనా మేం మద్దతిస్తాం అంటున్న కేజ్రీవాల్ వంటి వారిని కూడా రాహుల్ దూరం చేసుకున్నారు. అందుకే ఈ ఎన్నికల్లో మోడీ గెలిస్తే అది రాహుల్ చలవే. 



మరింత సమాచారం తెలుసుకోండి: