ప్రపంచంలో అగ్రదేశాల్లో ఒకటైన రష్య అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్  గురించి తెలియని వారు ఉండరు.  ఆయన స్వతహాగా మార్షల్ ఆర్ట్స్ లో ప్రావిణ్యం ఉన్న వ్యక్తి.  అంతే కాదు పుతిన్ మిగతా రాజకీయ నేతలకు భిన్నమైన వ్యక్తి. 2000 నుంచి రష్యాను పాలిస్తున్న పుతిన్ గతంలో రష్యన్ నిఘా సంస్థ కేజీబీకి అధినేతగా వ్యహరించారు. ఎప్పుడు అధికార పనుల్లో బిజీగా ఉండే పుతిన్ అప్పుడప్పుడు సేతదీరుతూ..ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతుంటారు. 

తాజాగా రష్యాలోని సోచీలో జరిగిన ఐస్ హాకీ ఎగ్జిబిషన్ గేమ్ లో పుతిన్ పాల్గొన్నారు.  ఈ సందర్భంగా సభికులకు అభివాదం చేస్తూ వేగంగా వెళుతున్న పుతిన్ ఒక్కసారిగా అదుపు తప్పి పడిపోయారు. 

వెంటనే సిబ్బంది అలర్ట్ కావడం..ఆయనను లేపడం జరిగింది..అయితే తనకు   ఏమీ జరగనట్లు ప్రేక్షకులకు చేతులు ఊపుతూ అభివాదం చేశారు. అన్నట్లు ఈ ఎగ్జిబిషన్ మ్యాచ్ లో పుతిన్ 8 గోల్స్ కొట్టినట్లు రష్యా మీడియా తెలిపింది. అయితే ఈ మ్యాచ్ లో ఎవరు గెలిచారు? అన్న విషయాన్ని మాత్రం చెప్పలేదు



మరింత సమాచారం తెలుసుకోండి: