గత కొంత కాలంగా తెలంగాణలో టి కాంగ్రెస్ పనితీరుపై సీనియర్ నేత వీహెచ్ హనుమంత రావు సీరియస్ గా ఉంటున్న విషయం తెలిసిందే.  ఇక్కడ నేతల అసమర్థత వల్లే ఇతర పార్టీలోకి అగ్ర నేతలు సైతం వెళ్లిపోతున్నారని ఆయన కొంత కాలంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు.  తెలంగాణలోని మూడు ఎమ్మెల్సీ సీట్లకు అభ్యర్థులకు ఖరారు చేయడానికి శనివారం గాంధీభవన్ లో ముఖ్య నేతలు సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో ముఖ్య నేతలు తెలంగాణ వ్యవహారాల ఇంచార్జీ కుంతియాతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్ అలీ, విహెచ్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో విహెచ్ తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేశారు. పార్టీ తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన తర్వాత విహెచ్ హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద జరిగే ధర్నాకు వెళ్లిపోయారు. పార్టీ మారినప్పుడే 11 మంది శాసనసభ్యులను పిలిచి మాట్లాడాల్సిందని, ఇప్పుడు మాట్లాడి ఏం చేస్తారని ఆయన అడిగారు.

నాంపల్లిలో పనిచేసిన ఫిరోజ్ ను హైదరాబాద్ లో పోటీకి ఎందుకు పెట్టారని, అక్కడ అభ్యర్థులే లేరా అని విహెచ్ ప్రశ్నించారు. శాసనసభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై కూడా ఆయన విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యేలు పార్టీ మారిన నియోజకవర్గాల్లో ఒక్కడే తిరిగి ఏం చేస్తాడని, తాము లేమా అని విహెచ్ ప్రశ్నించారు.  ఈ సమయంలోనే కాంగ్రెస్ నేతల్లో మద్య తోపులాటలు జరిగాయి.  వీహెచ్, నగేష్ ల మద్య వాగ్వాదం ముదిరి ఇద్దరూ ఒకరినొకరు తోసుకునే క్రమంలో వీహెచ్చ,కాంగ్రెస్ నేత నగేష్ పై చేయి చేసుకున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: