ఆన్‌లైన్ డేటింగ్ యాప్స్ ఇప్పుడు ట్రెండీగా మారాయి. వీటిప‌ట్ల యువ‌త ఎక్కువ‌గా ఆసక్తి చూపుతున్నారు.దీని ద్వారా అనేక మోస‌లు జరుగుతున్నాయి. యువ‌త త‌మ వివ‌రాలు, ఫోటోలు అప్‌లోడ్ చేయ‌డం వ‌ల్ల అనేక అన‌ర్థాలు జ‌రుగుతున్నాయి. డేటింగ్ యాప్స్ లో వ్య‌క్తిగ‌త స‌మాచారం పెట్ట‌డంతో పాటు గుర్తు తెలియ‌ని వ్య‌క్తుల‌తో ప‌రిచ‌యాలు పెంచుకోవ‌డం వ‌ల్ల ఎన్నో స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి.


ఆన్‌లైన్ డేటింగ్ యాప్స్ లో గుర్తు తెలియ‌ని వ్య‌క్తుల‌తో ప‌రిచ‌యాలు పెంచుకోవ‌డం వారితో స‌న్నిహితంగా మెల‌గ‌డం వ‌ల్ల చాలా మంది మోస‌పోతున్నారు. కొంత మంది అబ్బాయిలు కూడా అమ్మాయి పేరుతో ప్రొఫైల్ క్రియేట్ చేసి మోసాల‌కు పాల్ప‌డుతున్నారు. అంద‌మైన అమ్మాయిల ఫోలోలు అప్‌లోడ్ చేసి.. ఇంకో అబ్బాయితో చాటింగ్ చేసి అత‌ని ద‌గ్గ‌ర నుంచి డ‌బ్బు గుంజుతున్నారు. 


ఇక ఆన్ డేటింగ్ యాప్స్ మాయలో ప‌డి కొంత మంది త‌మ జీవితాలు నాశ‌నం చేసుకుంటున్నార‌ని పోలీసులంటున్నారు. గుర్తు తెలియ‌ని వ్య‌క్తుల‌తో ప‌రిచ‌యాలు పెంచుకుని ఇబ్బందులు ప‌డుతున్నార‌ని.. అయ‌తే ఇలాంటి యాప్స్‌కు యువ‌త దూరంగా ఉండాల‌ని పోలీసులు సూచిస్తున్నారు. 


అస‌లీ ఆన్‌లైన్ డేటింగ్ యాప్స్ ఎలా ప‌నిచేస్తాయ‌నే విష‌యాల‌ను పూర్తిగా వివ‌రించారు. అయితే వ్య‌క్తిగ‌త ఇన్ఫ‌ర్మెష‌న్ ఎవ‌రితో ప‌డితే వారితో షేర్ చేసుకుంటున్నారు. దీంతో ఎన్నో స‌మ‌స్య‌ల‌కు గుర‌వుతున్నారు. ఈ డేటింగ్ యాప్స్‌లో చాటింగ్ చేసేవారికి మాన‌సిక స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయ‌ని వైద్యులు చెబుతున్నారు. కొంత మంది ఫోటోలు చూసి వారితో స్నేహం చేస్తున్నార‌ని, ఆ వ్య‌క్తి మోస‌గాడ‌ని తెలిస్తే మాన‌సికంగా కుంగిపోతున్నార‌ని వైద్యులు చెబుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: