శ్రీకాకుళంలో బైక్ పెట్రోల్ దొంగ‌లు పెట్రేగిపోతున్నారు. కొంత‌మంది ఆక‌తాయి కుర్రాల్లు ఒక గ్యాంగ్‌లుగా ఏర్ప‌డి.. రాత్రైతే ఇంటి బ‌య‌ట పార్క్ చేసిన వాహనాల పెట్రోల్‌ను కొట్టేస్తున్నారు. ఆ పెట్రోల్ అమ్మ‌కుంటూ.. వాటితో వ‌చ్చిన సొమ్ముతో జ‌ల్సాల‌కు చేస్తున్నారు ఆ కుర్రాళ్లు. తాజాగా వారి గ్యాంగ్‌లో ఓ వ్య‌క్తి బ‌ర్త్ డే సెట్ర‌బేష‌న్స్ ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని న‌గ‌రంలో భారీగా పెట్రోల్ దొంగ‌త‌నం చేసి సీసీ కెమెరాకు అడ్డంగా బుక్క‌య్యారు. 


పట్ట‌ణంలో స్థానికంగా కొంద‌రు కుర్రాళ్లు.. ఒక గ్యాంగ్‌గా ఏర్ప‌డి చిల్ల‌ర దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డ‌తున్నారు. రాత్రైతే.. న‌గ‌రంలో బైక్‌ల‌పై తిరుగుతూ.. వాహ‌నాల్లో ఉండే పెట్రోల్‌ను కాజేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే.. త‌న గ్యాంగ్‌లో ఉన్న హిమ‌శేఖ‌ర్ బ‌ర్త్ డే వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. 


అత‌ని స్నేహితులు.. మొత్తం 20 మంది గ్యాంగ్‌.. ఎనిమిది బైక్‌ల‌తో రాత్రంతా రోడ్ల‌పై తిరుగుతూ నానా హ‌మంగా సృష్టించారు. రాత్రంతా రోడ్ల‌పై తిరుగుతూ.. రోడ్డు ప‌క్క‌న పార్క్ చేసిన వాహ‌నాల్లోని పెట్రోల్‌ను కాజేశారు. ఈ దొంగ‌త‌నాలు మొత్తం స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.


 మ‌రోవైపు బ‌ర్త్ డే జ‌రుపుకుంటున్న హిమ‌శేఖ‌ర్‌.. అతివేగంగా బైక్ న‌డిపించి.. ప్ర‌మాదానికి గురై చ‌నిపోయాడు. ఇంకోవైపు పెట్రోల్ దొంగ‌త‌నాల‌పై స్థానికులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో సీసీ ఫుటేజీ ఆధారంగా కొంత మంది కుర్రాళ్ల‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చిల్ల‌ర దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డితే..క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పోలీసులు హెచ్చ‌రిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: