ఏపీలో ఎన్నికల ఫలితాలు ఇంకా రాలేదు కానీ ఓ బలమైన  సామాజిక వర్గానికి చెందిన వారికి మాత్రం నడుస్తున్న కధ అర్ధంవుతున్నట్లే ఉంది. లోక్ సత్తా నాయకుడు  జయప్రకాష్ నారాయణ కు కూడా అసలు విషయం అర్ధమైందనిపిస్తోందని అంటున్నారు. విశాఖ పర్యటనలో జేపీ చేసిన కొన్ని కామెంట్స్ ఇందుకు ఉదాహరణగా చూడాలి.


ఏపీలో అధికారంలోకి వచ్చేందుకు జగన్ అలవికాని హామీలు ఇచ్చారని జేపీ ఇవాళ విశాఖలో జరిగిన ఓ మీటింగులో హాట్ కామెంట్స్ చేశారు. జగన్ ఇచ్చిన హామీలన్నీ అమలు కావాలంటే యాబై  వేల కోట్ల రూపాయలు అవసరం పడుతుందని జేపీ అన్నారు. మరి అంత డబ్బు బడ్జెట్లో ఉంటుందా. ఖర్చు చేసేందుకు వీలు అవుతుందా అని జేపీ ప్రశ్నించడం విశేషం.


అంతే కాదు ఏపీలో చంద్రబాబు ఎన్నికల ముందు పంచిన పసుపు కుంకుమ తాయీఅల విషయంలోనూ జేపీ కామెంట్స్ చేశారు. ఎన్నికల ముందు వేల కోట్లను పంచేస్తే పరిపాలన బాగా చేసినట్లా అని ప్రశ్నించారు. మొత్తం మీద అటు బాబుని తిడుతూ ఇటు జగన్ అధికారంలోకి వస్తే అంటూ జేపీ చేసిన వ్యాఖ్యలు ఇపుడు కలకలం రేపుతున్నాయి. జగన్ కి అధికారం ఖాయమన్న దాన్ని జేపీ లాంటి మేధావులు కూడా నమ్ముతున్నట్లుగా కనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: