అవును ఇంత వరకూ ఏ ముఖ్యమంత్రి తీసుకోని నిర్ణయాన్ని సిఎం అయితే జగన్మోహన్ రెడ్డి తీసుకోబోతున్నట్లు వైసిపి వర్గాలు చెప్పుకుంటున్నాయి. జగన్ నిర్ణయం చారిత్రాత్మకమని కూడా చెప్పుకుంటున్నాయి. ఇంతకీ ఆ నిర్ణయం ఏమిటంటే,  రాష్ట్ర ఆర్ధిక పరిస్దితిని దృష్టిలో పెట్టుకుని సిఎంగా కేవలం ఒక్క రూపాయి మాత్రమే జీతం తీసుకోవాలని నిర్ణయించుకున్నారట.

 

మామూలుగా అయితే ఎంఎల్ఏలకు నెలకు బేసిక్, అలవెన్సులు అన్నీ కలుపుకుని నెలకు సుమారుగా రూ .1.7 లక్షల దాకా అందుతుంది. ఇక మంత్రులైతే నెలకు రూ. 2.5 లక్షల దాకా అందుకుంటారు. కాబట్టి ముఖ్యమంత్రికి కూడా నెలకు 2.5 లక్షల రూపాయల జీతం వస్తుంది. సిఎంగా జగన్ ఒక్క రూపాయి జీతంకు పనిచేస్తానంటే మంత్రులు మాత్రం 2.5 లక్షల రూపాయలు తీసుకుంటారా ఏమిటి ? 

 

తన జీత, బత్యాలను తగ్గించుకోవటం ద్వారా ప్రభుత్వ ఖజానాకు ఎంతో కొంత భారం తగ్గించాలన్నది జగన్ ఆలోచనగా చెప్పుకుంటున్నారు. కాబట్టి ఇటు ప్రజాప్రతినిధులతో పాటు అటు యంత్రాంగం కూడా అదే బాటలో నడిచేందుకే ఎక్కువ అవకాశం ఉంది. ప్రస్తుతం చంద్రబాబునాయుడు ఆడంబరాలకు ఏ స్ధాయిలో ఖర్చులు పెడుతున్నారో అందరూ చూస్తున్నదే. కాబట్టే అనవసర ఖర్చులకు కోత వేయటంలో ఎక్కడెక్కడ కట్ చేయాలనే విషయంలో ఇప్పటికే జగన్ కసరత్తులు మొదలుపెట్టినట్లు సమాచారం.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: