త‌మిళ‌నాడుకు చెందిన మెకానిక‌ల్ ఇంజినీర్ ఒక‌రు అద్భుత ఆవిష్క‌ర‌ణ చేశారు. అదేంటంటే  పర్యావరణహిత ఇంజిన్‌ను తయారు రూపొందించారు. అది మామూలు ఇంజిన్ కాదు. బ్యాట‌రీ లేదా విద్యుత్ తో న‌డిచేది కూడా కాదు ఆ ఇంజిన్‌.. డిస్టిల్ వాట‌ర్‌ను ఫ్యూయ‌ల్‌గా తీసుకుని ప‌ర్యావ‌ర‌ణానికి అనుకూలంగా ఉండే ఆక్సిజ‌న్ వాయువును గాల్లోకి విడుద‌ల చేయ‌డ‌మే ఈ ఇంజిన్ యెక్క ప్ర‌త్యేక‌త‌. 


కోయంబత్తూర్‌కు చెందిన కుమారస్వామి ఈ ఇంజిన్‌ను రూపొందించారు. అలాగే ప్ర‌పంచంలో ఈ ఇంజిన్ రూపొందించిన మొట్ట‌మొద‌టి వ్య‌క్తిగా కూడా నిలిచారు. ఈ సంద‌ర్భంగా కుమార‌స్వామి మాట్లాడుతూ.. ఈ ఇంజిన్‌ను అభివృద్ధి చేయ‌డం కోసం దాదాపు 10 సంవ‌త్స‌రాలు ప‌ట్టింద‌ని చెప్పారు.  ప్రపంచంలోనే ఇలాంటి యంత్రాన్ని తయారు చేయడం ఇదే తొలిసారి. 


ఈ ఇంజిన్ హైడ్రోజన్‌ను ఇంధనంగా తీసుకొని ఆక్సీజన్‌ను బయటకి విడుదల చేస్తుంద‌ని ఇంజినీర్ కుమార‌స్వామి వెల్ల‌డించారు. భారత్‌లో ఇంజిన్‌ను విడుదల చేయాలనేది నా కోరిక. కానీ, దీని గురించి వివరించేందుకు ఎన్నో సంస్థ‌లు, కంపెనీల చుట్టూ తిరిగాను. ఎవరూ ఆసక్తి చూపించలేదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.


చివరికి జపాన్ ప్రభుత్వాన్ని సంప్రదించి త‌న‌ ప్రాజెక్టు వివరాలను వారికి వివరించాన‌ని చెప్పిన ఆయ‌న‌.. దానికి వారు ఆమోదం తెలిపార‌ని వెల్ల‌డించారు. మరికొన్ని రోజుల్లో తాను రూపొందించిన ఇంజిన్ జపాన్‌లో అందరికీ పరిచయం కాబోతోంద‌ని చెప్పారు.


కాగా.. ఇలాంటి ఇంజినీర్లు మ‌న భార‌త దేశంలో చాలా మంది ఉన్నారు.. కాని వారి ప్ర‌తిభ‌ను గుర్తించ‌లేని మ‌న ప్ర‌భుత్వాలు.. ఎవ‌రి కోసం ప‌నిచేస్తున్నాయో.. ఎందుకు ప‌నిచేస్తున్నాయో.. వాళ్ల‌లో వాళ్లు తిట్టుకోవ‌డం.. కొట్టుకోవ‌డం త‌ప్ప ఏమి చ‌య్య‌రు.. డ‌బ్బులున్న వారికే మొద‌టి ప్రాధాన్యత ఇస్తారు.. టాలెంట్ ఉన్న వారు మ‌న ప్ర‌భుత్వాల‌కు అవ‌స‌రం లేదు.. 


 దేశం అభివృద్ధి దూసుకోపోయేందుకు యువ‌త ముందుకు రావాల‌ని, ముందుకు రావాలే అంటారు.. వ‌స్తే ఇలా గెంటేస్తారు.. ఒక్క‌రు కూడా ప‌ట్టించుకోరు.. చివ‌ర‌కు చేసేది లేక ప‌క్క‌దేశాల‌కు వెళ్లి అక్క‌డ వారి టాలెంట్ ను ఉప‌యోగిస్తున్నారు మ‌న భార‌తీయులు.. అందుకు ఉదాహ‌ర‌ణే త‌మిళ‌నాడులోని మెకానిక‌ల్ ఇంజినీర్ రూపొందించిన ప‌ర్యావ‌ర‌ణ‌హిత ఇంజిన్‌.. 


మరింత సమాచారం తెలుసుకోండి: