టీఆర్ఎస్ పార్టీ ట్ర‌బుల్ షూట‌ర్‌గా పేరొందిన మాజీ మంత్రి, టీఆర్ఎస్ ముఖ్య నాయకుడు తన్నీరు హరీశ్‌ రావు గ‌త కొద్దికాలంగా తెర‌పై ఎక్క‌డా క‌నిపించ‌ని సంగ‌తి తెలిసిందే. త‌న నియోజ‌క‌వ‌ర్గం, త‌న ప‌నేంటో తాను చేసుకుపోతున్న ఆయ‌న గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చే జ‌రుగుతోంది. అయితే, తాజాగా కాంగ్రెస్ నాయకుడు, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.  ఆయ‌న కాంగ్రెస్‌లో చేరేందుకు చ‌ర్చ‌లు చేస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. దీనిపై హ‌రీశ్ ఆస‌క్తిక‌ర రిప్లై ఇచ్చారు.


కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం జంపల్లి గ్రామంలో బుధవారం నాడు పరిషత్ ప్రచారం నిర్వహించిన సందర్భంగా హరీశ్‌రావును ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మాజీ మంత్రి హరీశ్‌రావు టైమ్ కోసం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. హరీశ్‌రావు తమతో టచ్ లో ఉన్నారనీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.  టీఆర్ఎస్‌ పార్టీకి త్వరలోనే ఆయన గండికొడతారని, టీఆర్ఎస్‌ ప్రభుత్వం 6 నెలల్లో పడిపోతుందని అన్నారు. 


బొమ్మలరామారం ప్రచారంలో రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు పెద్ద ఎత్తున వైర‌ల్ అయ్యాయి.  దీనిపై హరీశ్‌రావు సోషల్ మీడియాలో స్పందించారు. ఒకే మాటతో వాటిని తప్పుపట్టారు. కోమటిరెడ్డి రాజగోపాల్ చెప్పిన మాటలు.. బిగ్ జోక్ అన్నారు. ఇటీవ‌ల కొందరు కాంగ్రెస్ నాయకులు చేస్తున్న కామెంట్ల‌కు ఇదే స‌మాధానం అన్న‌ట్లుగా... హ‌రీశ్ స్పందించార‌ని  అంటున్నారు. మ‌రోవైపు హరీశ్‌ రావు ఇచ్చిన రిప్లై సోషల్ మీడియాలో వైరల్ అయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: