సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశ రాజధాని ఢిల్లీతోపాటు ఆరు రాష్ర్టాల్లోని 59 లోక్‌సభ స్థానాల పరిధిలో ఎన్నికల పోలింగ్‌ ఆదివారం జ‌ర‌గ‌నుంది. ఉత్తరప్రదేశ్‌లో 14, హర్యానాలో 10, పశ్చిమ బెంగాల్‌, బీహార్, మధ్యప్రదేశ్‌లో 8, ఢిల్లీలో 7, జార్ఘండ్‌లో 4 స్థానాలకు పోలింగ్‌ జరుగనుంది. ఆరో విడత ఎన్నికల్లో భాగంగా పలువురు ప్రముఖ నాయకులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. నార్త్ ఈస్ట్ ఢిల్లీ నుంచి కాంగ్రెస్ తరపున ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్, న్యూఢిల్లీ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున మరో సీనియర్‌ నేత అజయ్ మాకెన్, ఈస్ట్ ఢిల్లీ నుంచి మాజీ క్రికెటర్ గౌతం గంభీర్, మధ్య ప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి జ్యోతిరాధిత్య సింధియా, ఆజంగఢ్ లోక్‌సభ స్థానం నుంచి యూపీ మాజీ సీఎం, ఎస్పీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌, సౌత్ ఢిల్లీ నుంచి కాంగ్రెస్ తరపున ప్రముఖ బాక్సర్ విజేందర్ సింగ్, భోపాల్‌ లోక్‌సభ స్థానం నుంచి మధ్య ప్రదేశ్‌ మాజీ సీఎం, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌, ఆయనపై బీజేపీ అభ్యర్థిగా సాద్వీ ప్రజ్ఞాసింగ్‌ పోటీలో ఉన్నారు. 


ఆదివారం ఉత్తర్‌ప్రదేశ్‌లో 14 స్థానాలు, హర్యానాలో 10, బీహార్, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్ రాష్ర్టాల్లో 8 చొప్పున, ఢిల్లీలో ఏడు, జార్ఖండ్‌లో నాలుగు స్థానాలకు పోలింగ్ జరుగుతుంది.  ప్రస్తుత ఎన్నికల్లో మరోసారి సత్తా చాటేందుకు అన్ని పార్టీలు తీవ్రంగా శ్రమించాయి. బీజేపీ తరఫున ప్రధాని మోదీ విస్తృత ప్రచారం చేశారు. విపక్షాలు ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీపై విమర్శల దాడి పెంచారు. ఇక బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్ర మంత్రులు, మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తదితరులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: