టీవీ9 కొత్త యాజమాన్యం విషయంలో ఫోర్జరీ కేసు, షేర్ల మార్పిడి విషయంలో సంబంధం ఉందని పోలీసులు ఆరోపిస్తున్న నటుడు శివాజీ ఎక్కడ ఉన్నారు.. ఇప్పుడు ఇదే చాలా మందిని వేధిస్తున్న ప్రశ్న. ఆయన కేంద్రంగా నాలుగు రోజుల నుంచి మీడియా అంతా గగ్గోలు పెడుతున్నా శివాజీ ఆచూకీ మాత్రం కనిపించలేదు. 


సాధారణంగా రాష్ట్రం కోసం ప్రాణాలిస్తా అనే టైపులో బిల్డప్ ఇస్తూ.. చంద్రబాబు పెట్ గా ముద్రపడిన శివాజీ... టీవీ9 వివాదం తర్వాత కనిపించడం లేదు. ఇన్ని ఆరోపణలు వస్తున్నా.. ఇంటికి నోటీసులు పంపినా.. స్పందన కనిపించడం లేదు. కనీసం తన వాయిస్ కూడా వినిపించడం లేదు. 

శివాజీ అదృశ్యం నేపథ్యంలో రవిప్రకాశ్ పై వచ్చిన ఆరోపణలు కూడా నిజమే అనిపించేలా శివాజీ పత్తా లేకుండా పోయారు. తెలంగాణ పోలీసులు  ఫోర్జరీ, నిధుల మల్లింపు అంశాలపై టీవీ నైన్ సిబ్బంది మూర్తిని ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో రవిప్రకాశ్, గరుడ పురాణం నటుడు శివాజీ పోలీసు విచారణకు హాజరుకాలేదు. 

శివాజీ ఎక్కడ ఉన్నది తెలియరాలేదని పోలీసులు  అంటున్నారు. డేటా చోరి కేసులో మాదిరి ఈయన కూడా ఏపీలోనే ఆశ్రయం పొందుతున్నారా అన్న చర్చ జరుగుతోంది. పరారీలో ఉన్న శివాజీకి మరోసారి నోటీసు జారీ చేసి విచారణకు హజరుకాకపోతే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని తెలంగణ పోలీసులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: