టీడీపీకి మహానాడు ఓ పండుగలాంటిది. ఎపుడు  మహానాడుని వాయిదా వేయడం జరగలేదు. గెలిచినా ఓడినా మూడు రోజుల పాటు ఆ ముచ్చటను వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నారు. మహానాడులో పార్టీ ఏడాది కార్యక్రమాలు డిసైడ్ చేసి సమీక్షలు పెట్టుకుంటారు. మహానాడు అంటే దాదాపు నెల ముందు నుంచే టీడీపీలో ఓ రేంజిలో హడావుడి ఉంటుంది. వేదిక దగ్గర నుంచి. భోజనాలు సమావేశాలు, నిర్వహణ ఇలా ప్రతీ దానికి ఓ కమిటీ వంతునా పాతికకు పైగా కమిటీలు వేస్తారు. అలాగే దాదాపుగా యాభై వరకూ తీర్మానాలు కూడా ముందే సిధ్ధం చేసుకుంటారు.


మరి ఈసారి మహానాడు వూసే టీడీపీలో కనిపించడంలేదు. అసలు ఉంటుందా అన్న డౌట్ కూడా తమ్ముళ్లకు వస్తోంది. పట్టుమని పదిహేను రోజులు కూడా మహానాడు లేదు. ఈ నెల 27 నుంచి 29 వరకూ మూడు రోజుల పాటు చేయాలంటే ఇపుడు ఉన్న సమయం అసలు సరిపోదు. మరి టీడీపీలో మాత్రం ఆ వూసే కనిపించడంలేదు. మహానాడు ఈసారి  చేస్తారా అన్నది తమ్ముళ్లకు కూడా అర్ధం కావడం లేదు. చంద్రబాబు ఎంతసేపు ఈవీఎంలు, సమీక్షలు అంటూ టైం పాస్ చేస్తున్నారు తప్ప మహానాడు గురించి మాట్లాడడం లేదు.


అయితే దీని మీద ఇంటెరెస్టింగ్ న్యూస్ ఒకటి స్ప్రెడ్ అవుతోంది. అదేంటంటే ఈసారి ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయోనని టీడీపీలో పెద్ద టెన్షన్ పట్టుకుందట. సరిగ్గా మహానాడుకు నాలుగు రోజుల ముందు 23న ఫలితాలు వస్తున్నాయి. టీడీపీ గెలిస్తే పరవాలేదు. ఓడితే డీప్ డిప్రేషన్లోకి పార్టీ మొత్తం వెళ్ళిపోతుంది. ఆ మూడ్లో ఉండగా మహానాడు ఎలా పెట్టుకుంటారన్నది కూడా  లాజిక్ పాయింటే. ఇక ఒక వేళ పార్టీ గెలిచినా మహానాడుకు టైం సరిపోదని, అందువల్ల ఒక రోజులో ముగిస్తారని అంటున్నారు. మొత్తానికి అర్ధం అయ్యేదేంటంటే టీడీపీకి ఇపుడు గెలుపు టెన్షన్ పట్టుకుంది. మహానాడుకు ఫలితాలకు లింక్ పెట్టుకుని పార్టీ టోటల్ గా  తల్లడిల్లుతోంది. ఓడితే గతేం కానని కూడా తమ్ముళ్ళు  కలవరపడుతున్నారుట.


మరింత సమాచారం తెలుసుకోండి: