కాంగ్రెస్ కు జగన్ మధ్య ఉన్న వైరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాంగ్రెస్ పార్టీ జగన్ ను ఎన్ని విధాలాగా ఇబ్బంది పెట్టాలో అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టింది. కానీ వాటికన్నింటికీ తట్టుకొని నిలబడ్డాడు. జగన్ తమను ధిక్కరించి వెళ్లిపోయాడని కాంగ్రెస్ పార్టీ భావించింది. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా జగన్ పై కేసులు పెట్టించింది కాంగ్రెస్ అధిష్టానం. తమతో ఉండి ఉంటే జగన్ కేంద్రమంత్రి అయ్యే వాడని, ముఖ్యమంత్రి కూడా అయ్యే వాడని కాంగ్రెస్ నేతలు అప్పట్లోనే ప్రకటించారు.


ఇక ఇటీవల కూడా జగన్ మీద కాంగ్రెస్ పార్టీ అక్కసుతోనే వ్యవహరించింది. చంద్రబాబుతో దోస్తానా కట్టి.. కాంగ్రెస్ వాళ్లు జగన్ తమకు శత్రువు అని ప్రకటించారు. జగన్ ను ఓడించడమే లక్ష్యమని ప్రకటించారు. అయినా కాంగ్రెస్ పార్టీ కి ఏపీలో ఉన్న సీన్ ఏమిటో అందరికీ తెలిసిందే. కాబట్టి జగన్ ను శత్రువుగా ప్రకటించుకుని కూడా కాంగ్రెస్ సాధించింది ఏమీ లేదు. ఆ సంగతలా ఉంటే.. అలా శత్రువుగా ప్రకటించిన వ్యక్తి వద్ద కాళ్ల బేరాన్ని మొదలుపెడుతోందట కాంగ్రెస్ పార్టీ. ఏపీలో మెజారిటీ ఎంపీ సీట్లను జగన్ గెలిచే అవకాశాలున్నాయన్న అంచనాల నేపథ్యంలో.. ఇప్పుడు జగన్ మద్దతు కోసం కాంగ్రెస్ ప్రయత్నాలను ముమ్మరం చేసినట్టుగా సమాచారం.


తాజాగా అందుకు సంబంధించి రాయబారిని కూడా రెడీ చేసిందట. ఏపీ  కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జిగా ఉన్న కేరళ మాజీ సీఎం ఉమెన్ చాందీని పంపించి.. జగన్ తో చర్చలు చేపట్టాలని కాంగ్రెస్ భావిస్తోందట. ఇదే  ఉమెన్  చాందీ ఏపీలో పోలింగ్ కు ముందు జగన్ తమకు శత్రువు అని ప్రకటించాడు. ఇప్పుడు అతడే చర్చలకు వెళ్తాడా? అయితే జగన్ మాత్రం ఫలితాలు వెల్లడి అయ్యే వరకూ ఎవరికీ ఏ హామీ లేదని స్పష్టం చేస్తున్నట్టుగా సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: