వైసీపీ అధినేత జగన్ తన గురించి ఏ విషయమైనా పెద్దగా సీరియస్ గా తీసుకోరు. ఆయనది అంత ధైర్యం. దానికి ఆరు నెలల క్రితం విశాఖ విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం ఉదాహరణ. అది జరిగిన తరువాత కూడా జగన్ మరో నాలుగు నెలలు పాదయాత్ర జనం మధ్యనే చేశారు. అయితే జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి  సరిగ్గా పోలింగుకు నెల రోజుల ముందు దారుణ హత్యకు గురి అయ్యారు. దాంతో జగన్ పూర్తిగా అలెర్ట్ అయ్యారని చెప్తారు.


ఓ విధంగా తమ కుటుంబానికి ముప్పు ఉందని జగన్ ముందు నుంచి వూహిస్తూ వచ్చారు. అది విశాఖ ఎయిర్ పోర్ట్ లో హత్యాయత్నం రూపంలో బయటపడింది. ఆ తరువాత చిన్నాన్నని పోగొట్టుకున్నారు. ఈ సమయంలో ఇంటెలిజెన్స్ వర్గాలు జగన్ని బాగా అలెర్ట్ చేశాయట. అమరావతి రాజధాని దగ్గరలోని తాడేపల్లిలో కోట్ల రూపాయలు పోసి జగన్ కొత్త ఇల్లు కట్టుకున్నారు. అయితే అక్కడ ఉండడం అంత మంచిది కాదు, ప్రాణాలకే ప్రమాదం ఉందని ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరించడంతోనే జగన్ మకాం వెంటనే హైదరాబాద్ కి మార్చేశారని చెబుతారు.


అయితే ఇపుడున్నది టీడీపీ సర్కార్. రేపటి రోజున వైసీపీ అధికారంలోకి వస్తే మాత్రం తప్పకుండా అదే జగన్ అధికార నివాసం   అవుతుందని అంటున్నారు. పవర్లో ఉంటే కనుక ఈ ముప్పు వంటివి ఉండవని జగన్ భావిస్తున్నారుట. ఇపుడున్న ప్రభుత్వ హయాంలో మాత్రం తనకు ఏపీలో అంతగా రక్షణ లేదని జగన్ భావించబట్టే హైదరాబాద్లో ఉంటున్నారని అంటున్నారు. మరి రేపు జగన్ సీఎం అయితేనే ఆ ఇల్లు కళకళలాడుతుందన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: