కేసీయార్ తెలివైన రాజకీయ నాయకుడు. పరిస్థితులు మొత్తం మధింపు చేసుకుని రంగంలోకి దూకేస్తారు. ఆయన తెలంగాణా తేవడంలోనే ఆ వ్యూహం నైపుణ్యం బయటపడింది. ఇపుడు రెండవమారు కేసీయార్ తెలంగాణాలో అధికారం లోకి పార్టీని తెచ్చారు. ఇక కేసీయార్ మరో టార్గెట్ పెట్టుకున్నారు. అది రీచ్ కావాలన్నది ఆయన ఆలోచనగా ఉంది.


అయితే అదంతా ఈజీకాదు. కేసీయార్ అతి చిన్న రాష్ట్రానికి సీఎంగా ఉన్నారు. ఎంత కేసీయార్ అనుకున్నా ఈ ఎన్నికల్లో టీయారెస్ కి 15 సీట్లు వచ్చినా కేంద్ర రాజకీయాల్లో ఆ నంబర్ చాలా తక్కువ. కేంద్రంలో ఇపుడు కాంగ్రెస్, బీజేపీల మధ్య ప్రధాని పోస్ట్ కోసం పెద్ద యుధ్ధమే జరుగుతోంది. మరో వైపు ప్రాంతీయ పార్టీలు కూడా ఆ పొస్ట్ మీదనే గురి పెట్టాయి. అటు తిరిగి ఇటు తిరిగి మమతా బెనర్జీ, మాయావతిల మధ్య ప్రధాని పదవి తిరుగుతుందని అంటున్నారు.  ఇక కేసీయార్ కి ఇపుడు ఏ కూటమితో సంబంధం లేకుండా ఫెడరల్ ఫ్రంట్ తో రాయబేరాలు నడపాలనుకుంటున్నారు. దాంతో కేసీయార్ ప్రధాని పదవి మీద ఆశలు వదిలేసుకున్నారట.


ఈ ఫ్రంట్ లో నిఖార్సుగా ఉన్న పార్టీలు రెండు మాత్రమే వైసీపీ, టీయారెస్. ఏపీలో జగన్ కి 20 ఎంపీ సీట్లు వస్తాయని కేసీయార్ గట్టిగా నమ్ముతున్నారు. అంటే మొత్తం 35 ఎంపీ సీట్లతో రేపటి రోజున డిల్లీలో ఏ సంకీర్ణ సర్కార్ ఏర్పాటు అయినా రాయబేరం చేసి ఉప ప్రధాని పదవి పొందాలన్నది కేసీయార్ ఎత్తుగడగా ఉంది. మరి కేసీయార్ కి ఆ పెద్ద పదవి రావాలంటే జగన్ మద్దతు తప్పనిసరి. జగన్ ఒకే అంటేనే కేసీయార్ డిల్లీ రాజకీయాల్లో కీలకమవుతారు. జగన్ వరకూ అయితే  ఈ విషయంలో పెద్ద సమస్య లేదనే అనుకోవాలి. ఆయనకు ఇప్పట్లో జాతీయ రాజకీయల మీద ఆశ లేదు. అందువల్ల కేసీయర్ కి మద్దతు ఇవ్వొచ్చు. అయితే ఏపీ అవసరాలు కూడా జగన్ చూసుకుని మద్దతు ఇస్తారని అంటున్నారు. చూడాలి గులాబీ బాస్ ఇపుడు జగన్ మద్దతు కోసం ఆలోచిస్తున్నారు. ఏం జరుగుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: