టీవీ 9 నుంచి అత్యంత అవమానకర రీతిలో బయటికి వెళ్లిపోయిన రవి ప్రకాష్ భారీ స్కెచ్ వేసినట్లు తెలుస్తుంది. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు.. ఆ ప్లాన్ ఇలా ఉంది. న్యూస్ 18 తెలుసు క‌దా. రిల‌య‌న్స్ అధినేత ముఖేశ్ అంబానీకి చెందిన మీడియా సంస్థ.తెలుగులో త‌న అదే పేరుతో ఓ న్యూస్ ఛానెల్ ను ఏర్పాటు చేయాల‌ని చాలా కాలం కింద‌టే అనుకున్నారు. కానీ కార‌ణాలేంటో తెలియ‌దు గానీ... అది కార్యరూపం దాల్చ‌లేదు.


ఇలాంటి కీల‌క విష‌యాల‌న్ని ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకునే ర‌విప్ర‌కాశ్.... న్యూస్ 18 బాధ్య‌త‌ల‌ను భుజానికెత్తుకోవ‌డానికే ముంబై వెళ్లార‌ట‌. న్యూస్ 18కు జాతీయ ఛానెల్ ఇమేజీ ఉంది. ఈ ఇమేజీ ముందు తెలుగులో టాప్ పొజిష‌న్ లో ఉన్న టీవీ9 సాటి రాద‌నే చెప్పాలి. ఓ జాతీయ ఛానెల్ కు చెందిన ప్రాంతీయ భాషా ఛానెల్ ను ర‌విప్ర‌కాశ్ చేజిక్కించుకుంటే... పెను సంచ‌ల‌న‌మేన‌ని చెప్పాలి. ర‌వి ప్రకాశ్ ట్రాక్ రికార్డు చూస్తే... ఒక్క అంబానీనే కాదు... ఏ పారిశ్రామిక‌వేత్త కూడా ఆయ‌న‌ను వ‌దులుకోర‌నే చెప్పాలి.


ఈ లెక్క‌లేసుకునే ర‌విప్ర‌కాశ్ ముంబైలో ల్యాండ‌య్యార‌ట‌. న్యూస్ 18 ఛానెల్ కోస‌మే ఆయ‌న ముంబైలో ల్యాండ‌య్యార‌ని, అయితే అంబానీతో ఆయ‌న ఇప్ప‌టికే భేటీ అయ్యారా?  లేక త్వ‌ర‌లో భేటీ జ‌రుతుందా? అన్న విష‌యం అయితే తేల‌లేదు గానీ... మొత్తంగా ర‌విప్ర‌కాశ్ ప్లాన్ అయితే ఇదేన‌ట‌. చాలా తెలివిగా ర‌విప్ర‌కాశ్ ర‌చించుకున్న ప్లాన్ వ‌ర్క‌వుట్ అయ్యే అవ‌కాశాలే ఎక్కువ‌గా ఉన్నాయ‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి. ర‌విప్ర‌కాశ్ అనుకున్న‌ట్లుగా ఈ ప్లాన్ వ‌ర్క‌వుట్ అయితే... తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్క ప్రాంతీయ పార్టీకి కూడా లొంగ‌ని ఓ మీడియా సంస్థ ఎంట్రీ ఇచ్చిన‌ట్టుగానే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: