ఒక హాస్య నటుడు సీరియస్ హీరో పాత్ర చెస్తే అవి విజయవంతం అయ్యే అవకాశాల కంటే అపహస్యం అవటానికే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఒకవేళ విజయవంత మైనా ఆ క్రెడిట్ ఆయనకు దక్కే అవకాశాలు ఉండవు. ఇదంతా గరుడపురాణం గా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సెలబ్రిటీగా మారిన నటుడు సొంఠినేని శివాజీ గురించే. దక్షిణ భారత దేశం లో  కేంద్రంలో ఉండి అధికార బిజేపి చెసే రాజకీయ కుట్రల జాతకాలు తానే విప్పుతానంటూ – ఆపరేషన్ గరుడ, ఆపరేషన్ ద్రవిడ, ఆపరేషన్ రాక్షస, ఆపరేషన్ కుమార, అంటూ ఎవరో రాసిన కథలను టివి 9 అండగా ఇతర పచ్చమీడియాల మద్దతుతో ఇటు చంద్రబాబు నాయుడుకు మద్దతుగా, వైఎస్ జగన్ పార్టీకి,  జనసేనకు వ్యతిరేకంగా తన శక్తిమేరకు పరోక్ష ప్రత్యక్ష ప్రచారం సాగించారు. 
Image result for operation garuDa dravida kumara rakshasa Sivaji
తెలంగాణలో కేసీఆర్ పై కూడా ఈ హాస్య నటుడు సాగించిన ప్రచారం అపహాస్యంగా మారి ఏమాత్రం పనికి రాకుండా పోయింది. ఇక కేంద్రం దక్షినాది రాష్ట్రాలపై చేయ తలపెట్టిన రాజకీయకుట్ర ప్రణాళిక అంతా తన దగ్గరే ఉందంటూ ఆపరేషన్ గరుడ, ద్రవిడ, కుమార, రాక్షస పేర్లు  చెప్పి ప్రజల్ని పరేషాన్ చేయబోయి తానే పరేషాన్ అయ్యాడు సొంఠినేని శివాజీ. చివరికి తనను తన లోని విషపురుషుడిని పెంచి పోషించిన రాక్షసామాత్య స్నేహితుడు టివి 9 రవి ప్రకాష్ గొంతుకలోతు కేసుల్లో ఇరుక్కు నేలా చేయడంతో అతీగతీ లేక అఙ్జాత వాసం అదే అండర్ గ్రౌండ్ కు చేరుకున్నాడు.
Image result for cine actor sivaji and Raviprakash
టివి 9 రవిప్రకాష్ తన దగ్గర ఏడాది క్రితం డబ్బు తీసుకుని – టివి 9 షేర్ లు అమ్మి, ఆ షేర్ లు మాత్రం తన పేరుతో ఖాతాలోకి బదలాయించలేదని ట్రిబ్యునల్ ను ఆశ్రయించడం ఈ సొంఠినేని శివాజీ గారి సినిమా కథని అందరు అతి తేలికగా అనుమానించేలా చేసింది. తనకూ రవిప్రకాష్ మద్య వివాదం సాగుతున్నట్లు ఒక సంఘటన సృష్టిద్ధామని అనుకుని ఆ వ్యూహంలో తెలివి లేమి తొందరపాటుతో తెల్లకాగితాలపై షేర్ల బదిలీ వ్యవహారం నడిపి రెండో సారి మొదటి తప్పు కప్పివేయటానికి తప్పు చేసి దొరికిపోయాడు సోకాల్డ్ ఏపికి ప్రత్యేక హోదా కోసం అనవరతం కష్టపడే కార్యకర్త  శివాజీ. ఇక ఆ షేర్లు బదిలీ గొడవకు కారణమైన వ్యక్తి రవిప్రకాష్ నేతృత్వం లో టివి 9 నడవాలంటూ కోర్టులో వింతవాదన తెచ్చి మరోసారి నిండా ఊబిలో మునిగిపోయాడు. 
Image result for cine actor sivaji and Raviprakash
అందరి జతకాలు చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టు- ఈ రాజకీయ పార్టీల జాతకాలు చెప్పే సినీ శివాజీ - తన జాతకం ఇలా తిరగబడుతుందని ఊహించలేదు. అనుక్షణం టివి 9 యాజమాన్య హక్కుల బదిలీ వివాదంలో తాను తన స్నేహితునికి ఏదో మేలు చేద్దామని అనుకుని అడ్డంగా ఫోర్జరీ కేసులో నిందితుడిగా నిలబడాల్సి వచ్చింది. 
Image result for cine actor sivaji and Raviprakash
అయితే ఈ కథానుక్రమణికలో ఇంతకాలం సొంఠినేని శివాజీని,  టివి 9 తో పాటు మద్దతు ఇచ్చిన  టిడిపి మద్దతు ఛానెల్స్ గా పేరుబడ్డ పచ్చ మీడియా మొత్తం ఇప్పుడు ఆయనకు మద్దతుగా నిలిచి కాపాడే ప్రయత్నం చేయకపోవటాన్ని బట్టి ఆయన ఎంత లోతులో మునిగిపోయాడో తెలుస్తూనే ఉంది.  అయితే ఈ కుట్రపూరిత వ్యవహారం సోషల్ మీడియాలో రవిప్రకాష్ కు మించి సినీ నటుడు సొంఠినేని శివాజీ "ట్రోల్ కావడం" గమనిస్తే ఇక ఆయన కథ ఇక ముగిసినట్లేనని అంటున్నారు నెటిజెన్లు.  ఇకపోతే రానున్న సమీప భవిష్యత్తులో  సొంఠినేని శివాజీ, రవిప్రకాష్ మద్య  జరగబోయే హాస్యదృశ్యాలను మహారంజుగా ఎంజోయ్ చేస్తూ  చూడవలిసివస్తుందని సెటైర్లపై సెటైర్లు పొంగిస్తూనే వున్నారు నెటిజెన్స్. ఈక నెటిజెన్స్ తో పాటు మనందరం వీరిద్దరూ చూపబోయే కామెడీ సినిమా కోసం నిరీక్షిద్ధాం. 

మరింత సమాచారం తెలుసుకోండి: