రేపటి ఫలితాల్లో వైసిపి అధికారంలోకి రావటం ఖాయమనే చెబుతున్నారు అందరూ. అయితే ఈ విషయంలో పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎక్కడా మాట తూలకుండా జాగ్రత్త పడుతున్నారు. రేపటి ఫలితాల్లో ఎన్డీఏకి కానీ లేకపోతే  యూపిఏ కూటముల్లో ఏదో ఒకటి అధికారంలోకి రావటం ఖాయంగా కనిపిస్తోంది. అంతేకానీ కెసియార్ చెబుతున్న ఫెడరల్ ఫ్రంట్ గురించి ఎవరూ మాట్లాడుకోవటం లేదు.


ఈ నేపధ్యంలోనే కెసియార్ అన్నా అటు ఇటు తిరుగుతున్నారు కానీ జగన్ మాత్రం ఫలితాల విషయంలో కానీ అటు జాతీయ స్ధాయిలో మద్దతు విషయంలో కానీ ఎక్కడా నోరిప్పటం లేదు. ఎందుకంటే, రాబోయే ఫలితాలను దృష్టిలో పెట్టుకుని జగన్ పెద్ద మాస్టర్ ప్లానే వేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

 

రేపటి ఫలితాల ప్రకారం జగన్ మూడు రకాలుగా ఆప్షన్లు పెట్టుకున్నారట. మొదటిది ఎవరికి మద్దతు ఇవ్వాలన్నా ముందుగా ప్రత్యేకహోదా ప్రకటించం. ఇక రెండోది చంద్రబాబునాయుడును దూరంగా ఉంచటం. మూడోది కేంద్రమంత్రివర్గంలో బెర్తులు. ప్రత్యేకహోదా ప్రకటించే వారికే తమ మద్దతుంటుందని జగన్ ఎప్పటి నుండో చెబుతున్న విషయం తెలిసిందే. కానీ రెండు, మూడు ఆప్షన్ల విషయంలో చంద్రబాబు చుక్కలు కనబడటం ఖాయంగా తోస్తోంది.

 

రాష్ట్రంలో జగన్ అధికారంలోకి వచ్చి కేంద్రంలో మళ్ళీ మోడినే  వస్తే చంద్రబాబు పరిస్ధితి ఎలాగుంటుందో ఎవరికి వారు ఊహించుకోవాల్సిందే. దానికితోడు కేంద్రమంత్రివర్గంలో కూడా జగన్ చేరితే చంద్రబాబు సంగతి గోవిందా. ఇప్పటికే దశాబ్దాలుగా స్టేలో కంటిన్యూ అవుతున్న ఓ కేసు విచారణ మొదలవుతోంది. దానికితోడు ఓటుకునోటు కేసు, జగన్ పై హత్యాయత్నం కేసు, ఐటి గ్రిడ్స్ కేసులో విచారణ కూడా స్పీడందుకుంటే చంద్రబాబు పరిస్ధితి కుడితిలో పడ్డ ఎలకలా తయారౌతుంది.

 

ఇవన్నీ ఒకఎత్తు ఐదేళ్ళ పాలనలో జరిగిన అవినీతి ఒకఎత్తు. పైన పేర్కొన్న కేసుల్లో ఏ ఒక్కదానిలో చంద్రబాబు ఇరుక్కున్నా చాలు రాజకీయ జీవితం అంతమైపోవటానికి. దానిమీద బోనస్ గా అవినీతి కేసులు కూడా పడితే అంతే సంగతులు. మొత్తం మీద రానున్న కాలమంతా చంద్రబాబుకు కష్టకాలమే అనే సంకేతాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఒకవేళ రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చినా సరే కేంద్రంలో మోడి తిరిగి ప్రధాని అయితే  చాలు చంద్రబాబుకు కష్టాలు మొదలైనట్లే.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: