హైదరాబాద్‌లో ఏపీ పోలీసుల గలాట సంచ‌లనం సృష్టించింది. సహచర కానిస్టేబుల్ పై తోటి పోలీసుల జులం చూపించిన తీరు వివాదాస్పదంగా  మారింది. ఖైరతాబాద్ కూడలిలో పోలీస్ జీపు నుంచి కానిస్టేబుల్ మధు కిందకు దూకేందుకు ప్ర‌య‌త్నించారు. బలవంతంగా జీపులోకి ఎక్కించేందుకు నలుగురు పోలీసులు ప్రయత్నించగా, తనను వదిలేయాలంటూ మధు వేడుకున్నారు. పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం, పెనుగులాట చోటు చేసుకుంది.


పోలీసుల పెనుగులాటను సెల్‌ఫోన్లో పౌరులు చిత్రీకరించారు. ఏపీఎస్పీ 11వ బెటాలియన్ కానిస్టేబుల్ ప‌నిచేస్తున్న‌ మధు త‌న‌ను బలవంతంగా విజయవాడకు తరలిస్తున్నారంటూ ఆవేదన వ్య‌క్తం చేశారు. AP9P 7167 నెంబర్ గ‌ల మ‌రో జీపులో పోలీసులు మధును వెంబడించారు. అయితే, పెనుగులాట సంద‌ర్భంగా పౌరుల జోక్యంతో మధును వదిలేసి పోలీసులు అక్క‌డి నుంచి జారుకున్నారు.
 


మరింత సమాచారం తెలుసుకోండి: