రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ఎవ‌రూ చెప్ప‌లేరు. ముఖ్యంగా అధికారంలో ఉన్న వారికి ఎప్పుడూ స‌వాళ్లు ఎదు ర‌వుతూనే ఉంటాయి. ఇలాంటి ప‌రిస్థితే ఇప్పుడు అధికార పార్టీలోనూ ఎదురవుతోంది. 2014లో ప్ర‌జాక్షేత్రంలో నిల‌బ‌డ‌కుం డానే మంత్రి అయ్యారు పి. నారాయ‌ణ‌.త‌ర్వాత ఎమ్మెల్సీగా చంద్ర‌బాబు ఆయ‌న‌కు ప్ర‌మోష‌న్ ఇచ్చారు. ఇక‌, ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో నారాయ‌ణ ప‌ట్టుబ‌ట్టి మ‌రీ నెల్లూరు సిటీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ త‌ర‌ఫున పోటీ చేశారు. ఈ విష యంలో చంద్ర‌బాబును అనన్ని విధాలా ఒప్పించి మ‌రీ ఎన్నిక‌ల‌కు ఏడాది ముందుగానే ఈ టికెట్‌ను క‌న్ఫ‌ర్మ్ చేసుకు న్నారు. 


ఆ వెంట‌నే నారాయ‌ణ నెల్లూరు సిటీ నియోజ‌క‌వ‌ర్గంలో స‌ర్వే చేప‌ట్టారు. ఇక్క‌డ త‌న ప‌రిస్థితి ఎలా ఉంది?  పార్టీ ప‌రిస్థితి ఎలా ఉంది? అనే విష‌యాల‌పై స‌ర్వే చేప‌ట్టారు. ఆ వెంట‌నే అభివృద్ది కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. పూర్తిస్థాయిలో ఇక్క‌డ మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు పెద్ద‌పీట వేశారు. ముఖ్యంగా ప్ర‌తి ఒక్క‌రినీ ఆక‌ర్షించేలా ప‌నులు చేప‌ట్టారు. ఇక‌, ఎన్నిక‌ల స‌మ‌యానికి మ‌రింత దూకుడు పెంచారు. త‌న కుటుంబం మొత్తాన్ని రంగంలోకి దింపి ప్ర‌చారం చేయించారు. దాదాపు రూ. 80 కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చు చేసిన‌ట్టు స‌మాచారం. 


అయితే, ఇప్పుడు ప్రచారం జ‌రిగిన తీరు, అనంతర ప‌రిణామాల‌ను త‌ర‌చి చూసుకుంటే.. నారాయ‌ణ‌కు ఒణుకు వ‌స్తోందట‌. త‌న‌ను సొంత పార్టీ నాయ‌కులే నిలువునా ముంచార‌ని ఆయ‌న క‌న్ఫ‌ర్మ్ అయ్యారు. ఎన్నిక‌ల్లో ఖ‌ర్చు కోసం డ‌బ్బులు బ‌య‌ట‌కు తీస్తే.. స‌గానికి పైగా కింది స్థాయి కేడ‌ర్ మింగేసింద‌ని నారాయ‌ణ‌కు ఇప్పుడు తెలిసింద‌ట‌. దీంతో ఆయ‌న త‌ల బాదుకుంటున్నారు. మ‌రోప‌క్క‌, ప్ర‌జ‌ల మ‌నిషిగా గుర్తింపు పొందిన వైసీపీ అభ్య‌ర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాద‌వ్‌కు అన్ని వ‌ర్గాలూ మ‌ద్ద‌తిచ్చాయ‌ని చెబుతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లోనూ అనిల్ ఇక్క‌డ భారీ మెజారిటీతో విజ‌యం సాధించారు.  ఇప్పుడు కూడా యువ‌త‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి, మాస్ జ‌నాలు ఆయ‌న వెంటే ఉన్నార‌ని అంటున్నారు. 


అంతేకాదు, ప్ర‌జ‌ల మ‌నిషిగా అనిల్ గుర్తింపు కూడా సాధించారు. ఈ నేప‌థ్యంలో మ‌ళ్లీ ఇక్క‌డ వైసీపీ యంగ్ కెర‌టంగా ఉన్న అనిల్ హ‌వా సాగింద‌ని చెబుతున్నారు. ఇదే జ‌రిగితే ఓ యువ‌కుడి చేతిలో నారాయ‌ణ బొక్క బోర్లా ప‌డ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక అనిల్ గెలిస్తే వైసీపీ అధికారంలోకి వ‌స్తే మంత్రి ప‌ద‌వి కూడా ఖాయ‌మ‌న్న చ‌ర్చ‌లు వైసీపీ వ‌ర్గాల్లోనే వినిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: