ఓ కుక్కను చంపాలంటే దానిపై పిచ్చిది అన్న ముద్ర వేయాలి. అప్పుడు చంపడం చాలా ఈజీ. చంపినా పెద్దగా జనం పట్టించుకోరు. ఏపీలో చంద్రబాబు సర్కారు కూడా ఆర్టీసీ పట్ల ఇలాగే వ్యవహరిస్తోందంటున్నారు వైసీపీ నేతలు. ఆర్టీసీ పరిస్థితిపై ఇటీవల పత్రికల్లో కథనాలు బాగా వస్తున్నాయి. 


ఆర్టీసీ నష్టాల ఊబిలో కూరుకుపోతోందని.. ఇక దాన్ని ప్రభుత్వం భరించడం కష్టమనే కోణంలో టీడీపీ అనుకూల పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. ఈ కథనాలు చూస్తుంటే.. మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తే ఆర్టీసీని అర్జంట్ గు ప్రైవేటు చేసేస్తారేమో అన్న ఆందోళన కార్మికుల్లో కలుగుతోంది. 

జగన్ అధికారంలోకి వస్తేనే ఆర్టీసీకి భవిష్యత్ ఉంటుందంటున్నారు వైసీపీ నేతలు. ధర్మపోరాట దీక్షల పేరుతో చంద్రబాబు ఆర్టీసీని ఇష్టానుసారంగా వాడుకున్నారని వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి అన్నారు. కనీసం ఆ సంస్థకు డబ్బులు కూడా చెల్లించలేదని  మండిపడ్డారు. ఆర్టీసీ మూసివేయాలనేది చంద్రబాబు లక్ష్య మంటున్న శ్రీకాంత్ రెడ్డి  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే ఆర్టీసీని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. 

ఆర్టీసీని ఎందుకు నష్టాల్లోకి నెట్టారంటూ వైసీపీ నేత విజయసాయిరెడ్డి కూడా ముఖ్యమంత్రిని నిలదీశారు. ఏటా రూ.650 కోట్ల నష్టాలు వస్తుంటే తమరు నియమించిన ఎండీ సురేంద్రబాబు ఏం చేసినట్లని ట్వీట్ ద్వారా ప్రశ్నించారు.  పోలవరం ప్రాజెక్ట్‌ సందర్శనకు బస్సులు సమకూర్చడంలో బిజీగా ఉన్నాడా? అని సూటిగా ప్రశ్నించారు విజయసాయిరెడ్డి.



మరింత సమాచారం తెలుసుకోండి: