చంద్రబాబు ఎంతలా గోల చేస్తున్నారో దానికి తగ్గట్టే పరిణామాలూ జరుగుతున్నాయి. బాబు మీడియా సమావేశాలు పెట్టి హాట్ కామెంట్స్ చేస్తే మౌనంగానే అవతల వైపు నుంచి  సమాధానాలు వస్తున్నాయి. అనుకున్నది నెరవేరే అవకాశాలైతే కనిపించడం లేదు. బాబు పట్టుదల ఎంతగా పట్టినా చివరికి అభాసు అవుతారా అన్న కామెంట్స్ వస్తున్నాయి.


మొదట 10వ తేదీ అన్నారు. తరువాత 14కి మార్చుకున్నారు. అయినా బాబు అనుకున్నట్లుగా మంత్రివర్గ  సమావేశం జరిగే అవకాశం కనిపించడంలేదు. ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల అధికారి ద్వివేది సెలవు మీద ఉన్నారు. ఆయన తిరిగి 16న విధుల్లో చేరుతారని అంటున్నారు. మరో వైపు మంత్రి వర్గ అజెండాని స్క్రీనింగ్ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం దాన్ని ద్వివేదీకి పంపగా దాన్ని ఆయన అటునుంచి అటే కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించారు.


ఇప్పటివరకూ  కేంద్ర ఎన్నికల సంఘం క్యాబినెట్ మీటింగ్ మీద ఏ నిర్ణయం చెప్పలేదు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నపుడు అత్యవసర  విషయాలు జరిగితే వాటి మీద అరుదుగా మంత్రి వర్గ సమావేశం ఉంటుంది. అయితే చంద్రబాబు పోనీ తుపాను, కరవు, తాగునీరు వంటి సమస్యల మీద చర్చిస్తామని అజెండా తయారు చేశారు. పోనీ తుపాను ఏపీ మీద ఎటువంటి ప్రభావం చూపించలేదు. ఇక కరవు, తాగునీరు వంటి సాధారణ వేసవి సమస్యలపైన అధికారుల స్థాయిలో ఎప్పటికపుడు రివ్యూ మీటింగులు పెడుతున్నారు. వాటిని చర్చించేటంత ఎమ‌ర్జెన్సీ మీటింగ్ నిర్వహించాల్సిన అవసరం అయితే లేదు.


ఈ కారణాల వల్లనే సీఈసీ ఇపుడు బాబు మంత్రివర్గ సమావేశానికి అనుమతి ఇవ్వకుండా జాప్యం చేస్తోందని అంటున్నారు. ఏది ఏమైనా ద్వివేదీ సెలవు  నుంచి రావాలి. అపుడు ఏమైనా ఈ వ్యవహారం కదులుతుందేమో చూడాలి. అయితే కోడ్ గురించి బాగా అవగాహన ఉన్న అధికారులు ఈ అజెండాకు మాత్రం సీఈసీ అనుమతి ఇవ్వకపోవచ్చుననే అంటున్నారు. మొత్తానికి ఎలాగైనా చివరి మంత్రివర్గ సమావేశం పెట్టాలనుకుంటున్న బాబు ఆశలు అడియాశలుగానే అవుతాయా. బాబుకు షాక్ తప్పదా అన్నది చర్చగా ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: