ఈ సారి కేంద్రంలో తామే అధికారంలోకి రాబోతున్నామని బీజేపీ వారు బల్ల గుద్ది చెబుతున్నారు. అయితే మోడీ చేసిన వ్యాఖ్యలు తమ పార్టీకి మెజారిటీ రాదని వచ్చే విధంగా మాట్లాడటం విశేషం. అయితే తాము ప్రస్తుత ఎన్డీయే రూపంలో కూడా అధికారాన్ని సొంతం చేసుకునే అవకాశం లేదని సుబ్రమణ్యస్వామి వంటి వాళ్లు తేల్చారు. మోడీ మళ్లీ ప్రధాని అయ్యే ఛాన్సులు కూడా అంతంత మాత్రమే అని వారు పరోక్షంగా అనేశారు. ఎన్డీయేలోకి కొత్త పార్టీలు వస్తే ప్రధాని అభ్యర్థి మారతారు అని ఆయన కుండబద్ధలు కొట్టారు.


రాంమాధవ్ ప్రకటన కూడా అలానే ఉంది. అయితే మొదట ఇలా మాట్లాడి తమ వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని రాజకీయ నేతలు అనడం మామూలే. మరి మోడీ కామెంట్ ను ట్విటర్లో పోస్టు చేసిన బీజేపీ ఏమంటుందో కానీ.. మోడీ చేసిన ఒక వ్యాఖ్యగా భారతీయ జనతాపార్టీ అధికారికంగా పెట్టిన ఒక ట్వీట్ కమలం పార్టీలో కాన్ఫిడెన్స్ తగ్గిపోయిందనే భావనను కలిగిస్తూ ఉంది.


ఇంతకీ మోడీ ఏమన్నారంటే.. 'సంకీర్ణ ప్రభుత్వాలు నడపడం భారతీయ జనతా పార్టీకి బాగా తెలిసిన ఆర్ట్. నేను సంస్థాగతంగా పని చేస్తున్నప్పుడు వివిధ రాష్ట్రాల్లో సంకీర్ణ  ప్రభుత్వాల్లో పని చేశా. తన హయాంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని గొప్పగా నడిపిన వాజ్ పేయి వారసులం మనం..' అంటూ కమలం పార్టీ సమావేశంలో మోడీ ఈ వ్యాఖ్యానించారట. ఈ మేరకు భారతీయ జనతా పార్టీ తన అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్టుచేసింది. ఈ మాటల అర్థం ఏమిటో.. మోడీ ఫీలింగ్స్ ఏమిటో, ఆయన ఏం చెప్పదలుచుకున్నారో బయటి వాళ్లకు స్పష్టంగా అర్థం అవుతోంది. ఈసారి సొంతంగా మెజారిటీ రాదు.. సంకీర్ణ ప్రభుత్వమే, దాన్ని నడపడం తమకు చేతనవుతుందని మోడీ ముందుగానే చెబుతున్నట్టుగా ఉంది ఇది. 

మరింత సమాచారం తెలుసుకోండి: