ఏపీలో ఎన్నికల అనంతరం అన్ని పార్టీలు యాక్టివ్ రోల్ పోషించాయి, కానీ జనసేన  పార్టీ మాత్రం సైలెంట్ గా రాజకీయాలని పరిశీలిస్తూ ఏమి చేయాలో తదుపరి కార్యాచరణ ఏమిటో అనేవిధంగా ఊగిసలాడింది. ఫలితాల లెక్కల మాట అలా ఉంచితే ఫలితాల అనంతరం తమ గెలుపు గుర్రం అధికారంలోకి వచ్చే పార్టీ లోకి వెళ్ళిపోతుందో అనే భయం మాత్రం పవన్ కళ్యాణ్ ని నీడలా వెంటాడుతోంది.  ఒక వేళ అదే గనుకా జరిగితే ఏమి చేయాలి అనే మీమాంసలో ఉండిపోయారు పవన్ కళ్యాణ్ అందుకే కాబోలు ఎన్నికలు అయిన చాలా రోజుల తరువాత తమ పార్టీ ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టారు. కానీ ఈ మీటింగ్ ఇంత హడావిడిగా పెట్టడానికి గల కారణం వేరే ఉందట.

 

పవన్ ఏర్పాటు చేసిన అభ్యర్ధుల మీటింగ్ లో పవన్ ప్రసంగించిన మొదటి మాట “ప్రజారాజ్యంలోకి వచ్చినవారు ఆశలతో వచ్చారు, జనసేనలోకి వచ్చినవారు ఆశయాలతో వచ్చారు” ఈ వ్యాఖ్యలతో ఒక్కసారిగా అభ్యర్ధులు ఉలిక్కి పడ్డారట. ఒకింత తేరుకుని జనసేనానిలో లోలోపల దాగున్న భయాన్ని గుర్తించారు. చుట్టుపక్కల ఉన్న అనుయాయులు సైతం పవన్ తనలో ఉన్న భయాన్ని బయటపెట్టారని చెవులు కూడా కోరుకున్నారట. ఇదిలాఉంటే అసలు ఈ ప్రస్తావన పవన్ ఎందుకు తీసుకువచ్చారు అంటే కారణం లేకపోలేదని అంటున్నారు.

 

ఏపీలో వచ్చే రిజల్స్ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వస్తే పరవాలేదు, కానీ వైసీపీకి అనుకూలంగా వస్తే జనసేన తుడిచిపెట్టుకుపోవడం ఖాయం అనే పక్కా ఇన్ఫర్మేషన్ పవన్ వద్ద ఉందనేది పరిశీలకుల అభిప్రాయం. ప్రజారాజ్యం అనుభవమే తనకి కలిగే అవకాశం ఉండనే ఆలోచన పవన్ లో ఉండబట్టే పవన్ ఈ తరహా వ్యాఖలు చేశారని. ముందుగానే అభ్యర్దులని తనదైన శైలిలో ఆకట్టుకుని తన పార్టీలోనే కొనసాగేలా చేయడానికే ఈ మీటింగ్ ఏర్పాటు చేశారనేది అందరికి తెలిసిన విషయమే. కానీ ఎంతమంది ఎన్నికల తరువాత తనతో కొనసాగుతారు అనేది మాత్రం అంచనాలు వేయలేక పోతున్నారట పవన్ కళ్యాణ్.

 

అందరూ ఊహించినట్టుగా వైసీపీ అధికారంలోకి వస్తే జనసేన  పార్టీని  మరో ఐదేళ్ళ వరకూ ఎలా నడపాలి..?? , జగన్ తనపై ప్రయోగించే రాజకీయ ఎత్తుగడలని ఎలా ఎదుర్కోవాలి, పార్టీకి నిధులని ఎలా కేటాయించాలి. సినిమాలు చేస్తూ వెళ్తే పార్టీని సక్సెస్ఫుల్ గా ముందుకు నడిపే వ్యక్తీ ఎవరు ఉన్నారు అనేటువంటి సందేహాలు పవన్ కళ్యాణ్ ని వేధిస్తున్నాయట. ఒక వేళ జగన్ అధికారంలోకి వస్తే పవన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాలి అంటున్నారు విశ్లేషకులు.


మరింత సమాచారం తెలుసుకోండి: