తెలుగు మీడియా రంగంలో పోటీ లేకుండా వెలుగొందుతున్నవి రెండే రెండు.. ఒకటి ఈనాడు.. మరొకటి టీవీ9.. ఈ రెండింటినీ ఇప్పటి వరకూ పోటీ మీడియాలు కనీసం ఒక్కసారి కూడా బీట్ చేయలేదు. పత్రికల్లో ఈనాడు స్థాయి గురించి ప్రత్యేకంగాచెప్పనక్కర్లేదు.. 


ఇప్పుడు ఈనాడును దాటే సీన్ ఏ పత్రికకూ కనుచూపు మేరలో లేదు. టీవీ ఛానళ్ల విషయానికి వస్తే.. టీవీ9 మొదటి నుంచి నంబర్ వన్ గా ఉంటోంది. ఆ ఛానల్ ను బీట్ చేసేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ ఏదీ వర్కవుట్ కాలేదు. రవిప్రకాశ్ టీమ్ అలాంటిది. 

మరి ఇప్పుడు రవిప్రకాశ్ లేడు.. అందుకే పోటీ ఛానళ్లు ఇదే మంచి అవకాశంగా తీసుకుంటున్నాయి. రవిప్రకాశ్ టీమ్ నుంచి ఎవరైనా బయటకు వస్తారేమో అంటూ వాకబు మొదలెట్టేశారు.  యాజమాన్యం మార్పు, రవిప్రకాశ్ పై కేసు వంటి వివాదాల ప్రభావం ఉద్యోగులపై లేకుండాపోదు.  

అందుకే ఇదే అదనుగా పోటీ ఛానళ్లు తమ  వంతు ప్రయత్నాలు చేయకుండా పోవు. కాకపోతే అది అంత సులభం కాదు. రవిప్రకాశ్ ఆధ్వర్యంలో ఓ వ్యవస్థ ఏర్పడిపోయింది. ఇప్పుడు ఆయన ఉన్నా లేకపోయినా పెద్దగా ఇబ్బందిలేదు. కొత్తగా ఏమీ చేయకపోయినా.. ఉన్నది ఉన్నట్టు నడుపుకుంటే ప్రస్తుతానికి టీవీ9 స్థానానికి ఇబ్బంది ఉండకపోవచ్చు. 



మరింత సమాచారం తెలుసుకోండి: