టీవీ9 సీఈవోగా ఉన్న రవిప్రకాశ్ ప్రజారాజ్యం పార్టీ కొత్తలో ఆ పార్టీ గొంతు నొక్కేందుకు తన మీడియా ద్వారా ప్రయత్నించారా.. చిరంజీవిని అణగదొక్కేందుకు తన మీడియా పవర్ వాడారా.. అన్న చర్చ ఇప్పుడు మొదలైంది. రవిప్రకాశం అజ్ఞాతంలోకి వెళ్లిన వేళ ఆయన అరాచకాలను కొందరు జర్నలిస్టులు గుర్తు చేసుకుంటున్నారు.  


ఇందుకు మచ్చుకు ఓ ఘటన: 

2009లో చిరంజీవి తిరుపతి ఎమ్మెల్యేగా గెలిచిన కొద్ది నెలల తర్వాత అనివార్య కారణాల వల్ల చిరంజీవి ఓ నెల రోజులు తిరుపతి రాలేదు. దీంతో టీవీ9 లో చిరంజీవి కనిపించుట లేదు అంటూ ఒక పెద్ద కథనాన్ని ప్రసారం చేసింది. చిరంజీవిని ఎన్నుకుని తప్పు చేశామంటూ కొందరు విద్యార్థులు నిరసన చేసిన దృశ్యాలు ప్రసారం చేశారు. 

చిరంజీవి మీద పోలీసు కేసు కూడా పెట్టబోతున్నామంటూ వారు చెప్పారన్నది ఆ కథనం సారాంశం. ఓవరాల్‌ గా చిరంజీవి కనిపిస్తే తిరుపతిలో ప్రజలు తిరగబడేలా ఉన్నారన్న అర్థం వచ్చేలా ఆ కథనం రూపొందించారు. చిరంజీవి వెంటనే తిరుపతి పర్యటనకి వెళ్లగా, ఎప్పట్లాగే వేల మంది అభిమానులు వచ్చారు. మరి టీవీ9లో ఇలా వచ్చిందేమిటా అని ఆరాతీస్తే.. అసలు విషయం తెలిసిందట. 

వేరే ప్రాంతాల నుండి వచ్చి ఎస్వీ యూనివర్సిటీలో చదువుకుంటున్న కొంతమంది విద్యార్థులకు, టీవీ9 వాళ్లే ఎలా మాట్లాడాలో తర్ఫీదు ఇచ్చి, టీవీ9 వాళ్లే తయారు చేయించి ఇచ్చిన ప్లకార్డులు పట్టించి ఆ వార్తాకథనాన్ని వండారట. చిరంజీవి తిరుపతి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి, నియోజకవర్గ పనుల విషయంలో మెరుగ్గా కష్టపడ్డాడు అన్న నిజం చెప్పు చేసుకునేలోగా, చిరంజీవి కనిపించడం లేదని తిరుపతి స్థానికులు కేసులు పెడుతున్నారు అన్న అబద్ధం ప్రపంచమంతా చుట్టి వచ్చేలా రవి ప్రకాష్ వార్తను వండాడు అని ఓ జర్నలిస్టు తన జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: