సినిమా ఫీల్డు అయిపోయింది. రాజకీయాలూ అయిపోయాయి. అందుకే తాజాగా విద్యారంగంలోకి దిగింది చిరంజీవి కుటుంబం. ఈ విద్యా సంవత్సరం నుండే చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్స్ పేరుతో విద్యా వ్యాపరంలోకి చిరంజీవి కుటుంబం అడుగుపెట్టింది. స్కూల్స్ ను మొదటగా శ్రీకాకుళం జిల్లా నుండి మొదలుపెట్టబోతోంది. పేరుకు చిరంజీవి స్కూల్సే అయినా ఇందులో తమ్ముడు నాగుబాబు కూడా యాక్టివ్ రోల్ ఉండబోతోంది.

 

 సినీమా ఫీల్డులో చిరంజీవి ఏ విధంగా రాణించారో అందరికీ తెలిసిందే. చిరంజీవిని అడ్డుపెట్టుకుని తమ్ముళ్ళు నాగుబాబు, పవన్ కల్యాణ్ కూడా ఎంటరయ్యారు. తర్వాత రెండో తరం చిరంజీవి కొడుకు రామ్ చరణ్ తేజ,  నాగుబాబు కొడుకు వరుణ తేజ, కూతరు నీహారిక కూడా సినిమాల్లో నటిస్తున్నారు. సరే మేనల్లుళ్ళు అల్లు అర్జున్ సోదరులు కూడా ఉన్నారు లేండి.

 

సినిమా ఫీల్డులో సంపాదించిన ఇమేజితో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన చిరంజీవి ఇక్కడ మాత్రం ఫెయిలయ్యారనే చెప్పాలి. ఏర్పాటు చేసిన ప్రజారాజ్యంపార్టీని కాంగ్రెస్ లో కలిపేసినందుకు రాజ్యసభ తర్వాత  కేంద్రమంత్రి పదవి బాగానే ముట్టాయి చిరంజీవికి. రాజ్యసభ పదవీకాలం అయిపోయిన తర్వాత చాలాకాలం సైలెంట్ అయిపోయారు. తర్వాత మళ్ళీ సినిమాలతో సెకెండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన విషయం తెలిసిందే.

 

తాజాగా వచ్చే జూన్ నెల విద్యా సంవత్సరం నుండి విద్యా వ్యాపారంలోకి కూడా అడుగుపెట్టారు. శ్రీకాకుళం పట్టణం శివారులోని పెద్దపాడు రోడ్డులో తనపేరుతోనే  ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటుచు శ్రీకారం చుట్టారు. నర్సరీ నుండి 5వ గ్రేడు వరకూ ఐజిసిఎస్ఇ, సీబిఎస్ఇ విధానంలో టీచింగ్ ఉంటుంది. ఏసి క్లాసులు, ఆడియో, విజువల్ ల్యాబులు, కంప్యూటర్ ల్యాబులు, సీసీటివి ద్వారా పర్యవేక్షణ, పేరెంట్ టీచర్ ముఖాముఖి లాంటి అనేక సౌకర్యాలు కల్పిస్తున్నారు.

 

ఈ స్కూళ్ళకు చిరంజీవి గౌరవ వ్యవస్ధాపకునిగా ఉంటారు. కొడుకు రామ్ చరణ్ తేజ గౌరవ అధ్యక్షుడిగాను,  తమ్ముడు నాగుబాబు  గౌరవ ఛైర్మన్ గాను, అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామినాయుడు గౌరవ కన్వీనర్ గా ఉంటారు. స్కూల్లో చదవదలచుకున్న చిరంజీవి అభిమానుల పిల్లలకు  ఫీజుల్లో  ప్రత్యేక  రాయితీలుంటాయని సీఈవో శ్రీనివాసరావు చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: