చంద్రబాబునాయుడుకు కేంద్ర ఎన్నికల సంఘం పెద్ద షాకే ఇచ్చింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో క్యాబినెట్ సమావేశం పెట్టాలన్న చంద్రబాబు పంతంపై ఎన్నికల సంఘం నీళ్ళు చల్లింది. కోడ్ అమల్లో ఉన్నపుడు క్యాబినెట్ సమావేశం పెట్టేందుకు వీల్లేదంటూ స్పష్టంగా చెప్పేసింది. ఆ విషయాన్ని చెప్పేందుకే చంద్రబాబును చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యం నేరుగా కలిసి వివరించారు.

 

ఎన్నికల సంఘం ఆదేశాల ద్వారా చీఫ్ సెక్రటరీ అయిన ఎల్వీతో మొదటి నుండి చంద్రబాబు గొడవలు పెట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఎల్వీ, ఎన్నికల కమీషన్ పై పంతంతోనే క్యాబినెట్ సమావేశం పెట్టాలని చంద్రబాబు నిర్ణయించారు. అయితే అందుకు ఎన్నికల కమీషన్ అనుమతించాలని అనుకోండి అది వేరే సంగతి. క్యాబినెట్ లో చర్చించదలచుకున్న అంశాలను కూడా చంద్రబాబు సిఎస్ కు పంపారు.

 

చంద్రబాబు దగ్గర నుండి వచ్చిన నోట్ ను ఎల్వీ ఎన్నికల కమీషన్ కు పంపారు. అజెండాను పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం క్యాబినెట్ పెట్టాల్సిన అత్యవసర పరిస్ధితేమీ లేదని అభిప్రాయపడింది. దాంతో చంద్రబాబుకు షాక్ కొట్టినట్లైంది. ఆ విషయాన్నే నేరుగా చంద్రబాబుతో ఎన్నికల కమీషన్ చెప్పించింది.

 

మరి కేంద్ర ఎన్నికల కమీషన్ తాజా నిర్ణయంతో చంద్రబాబు ఏమి చేస్తారో చూడాలి. క్యాబినెట్ సమావేశం పెట్టి కీలకమైన కొన్ని బిల్లులను పాస్ చేయించుకోవాలని చంద్రబాబు పెద్ద ప్లానే వేశారు. ఆ విషయాన్ని బహుశా ఎలక్షన్ కమీషన్ ఏమన్నా గ్రహించిందేమో. అందుకనే క్యాబినెట్ సమావేశానికి రెడ్ సిగ్నల్ చూపించింది.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: