రోజురోజుకు మ‌హిళ‌ల ప‌ట్ల అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. వారి ఆగ‌డాల‌కు ఎన్ని చ‌ట్టాలు తెచ్చినా.. ఎన్ని కేసులు పెట్టినా ఆట‌క‌ట్టించ‌లేక‌ పోతున్నారు. తాజాగా ఇలాంటి ఘ‌ట‌న ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లో చోటు చేసుకుంది. అందుకు యూపీలో జ‌రిగిన ఘ‌ట‌నే ఉదాహ‌ర‌హణ. మ‌హిళ‌ల ప‌ట్ల జ‌రుగుతున్న దారుణాల‌ను అరిక‌డ‌తామంటూ అధికారంలోకొచ్చిన బీజేపీ ప్ర‌భుత్వం.. అందుకు చేప‌ట్టిన చ‌ర్య‌లు మాత్రం మ‌చ్చుకైనా క‌న‌ప‌డ‌టం లేదు.. 


వివ‌రాల్లోకి వెళ్తే.. చిన్న వ‌య‌సులోనే భ‌ర్త  నిపోయిన అభాగ్యురాలిని ఆమె తండ్రి, అత్త కలిసి రూ.10వేల‌కు అమ్మేశారు. ఆమెను కొనుకున్న‌వాడు చిత్ర హింస‌లు పెట్టాడు. అంతేకాదు అత‌డి స్నేహితులు సామూహిక అత్యాచారాల‌కు ప్పాడ్డారు. అయితే స‌ద‌రు బాధితురాలు ఈ విష‌యంపై పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. అయినా స‌రె పోలీసులు ప‌ట్టించుకోలేదు. 


ర‌క్షించే వారే ప‌ట్టించుకోక‌పోవ‌డంతో.. మ‌న‌స్తాపం చెందిన బాధితురాలు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసింది. గ‌త నెలలో జ‌రిగిన ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకొచ్చింది. 80 శాతం కాలిన గాయాల‌తో బాధితురాలు ప్ర‌స్తుతం ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతుంది. మృత్యువుతో పారాడుతుంది.


ప‌శ్చిమ యూపిలోని హ‌పూర్‌కు చెందిన బాధితురాలి భ‌ర్త త‌న చిన్న వ‌య‌సులోనే చ‌నిపోయాడు. దీంతో తండ్రి.. ఆమె అత్తా క‌లిసి బాధితురాలిని రూ. 10 వేల‌కు అమ్మేశారు. అత‌డు చాలా మంది ద‌గ్గర అప్పులు తీసుకున్నాడు. ఈ నేప‌థ్యంలో అప్పులు తీసుకున్న వారి వ‌ద్ద‌కు బాధితురాలిని ప‌నులకు పంపించేవాడు.


ఈ నేప‌థ్యంలో ప‌నికి వెళ్లిన ఆమెను అక్క‌డ వాళ్లు చుక్క‌లు చూపించేవారు. ఆమెను చిత్ర హింస‌లు పెట్టేవాళ్లు. ఎన్నో సార్లు ఆమెపై అత్యాచారాల‌కు పాల్ప‌డ్డారు. దీనిపై బాధితురాలు పోలీసుల‌కు చాలా సార్లు ఫిర్యాదు చేసింది. అయినా పోలీసులు ప‌ట్టించుకోలేదు. త‌న గోడును ప‌ట్టించుకునే వాడు లేక‌పోవ‌డంతో ఏప్రిల్ 28న ఈ అభాగ్యురాలు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. 


ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్మన్ స్వాతి మలివాల్ స్పందించింది. ఆ అభాగ్యురాలికి జ‌రిగిన దారుణాలను తెలుసుకుని తీవ్రంగా ఫైర్ అయ్యారు.  బాధిత మహిళకు న్యాయంచేయాలంటూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ఆమె తేలిపారు. ఈ మేర‌కు యూపీ సీఎంకు ఆమె లేఖ రాశారు.  పోలీసుల వ్యవహరించిన తీరును స్వాతి మలివాల్ ఎండగట్టారు.


బాధితురాలు ఇంత వేధింపుల‌కు గురైనా.. ఫిర్యాదు చేసినా పోలీసులు నిరాక‌రించార‌ని ఆమె మండిప‌డ్డారు. పోలీసులు ఆమెప‌ట్ల ప్ర‌వ‌ర్తించిన తీరుకు సిగ్గుమాలిన చ‌ర్య‌గా మ‌హిళా క‌మిష‌న్ చైర్మ‌న్ స్వాతి మ‌లివాల్ అభివ‌ర్ణించారు. బాధితురాలుకు త‌క్ష‌ణ‌మే ప‌రిహారం కింద కొంత మొత్తం విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేశారామె. 


ఇదిలా ఉంటే మరోవైపు, ఈ ఘటనలో 14 మందిపై కేసు నమోదుచేసినట్టు హపూర్ ఎస్పీ యశ్వీర్ సింగ్ ఆదివారం వెల్లడించారు. అయితే బాధితురాలిని కొన్న స‌దరు వ్య‌క్తి చాలా మంది ద‌గ్గ‌ర అప్పులు తీసుకున్నాడు. అప్పులు తీర్చ‌లేక.. దాని కోసం బాధితురాలిని బ‌ల‌వంతంగా వారి ఇళ్ల‌ల్లో ప‌నికి పంపిచార‌ని లేఖ‌లో పేర్కొన్నారు. క‌నీసం ఆమెకు జీతం కూడా ఇవ్వ‌క‌పోగా.. సామూహిక అత్యాచారాల‌కు పాల్ప‌డ్డార‌ని స్వాతి మ‌లివాల్ లేఖ‌లో వివ‌రించారు. ఈ నేప‌థ్యంల తాను పోలీసు అధికారుల‌తో స‌హా హ‌పూర్ ఎస్పీని క‌లిశాన‌ని పేర్కొన్నారు. 


బాధితురాలి కంప్లేయింట్ ఇస్తే ఎఫ్ఐఆర్ న‌మోదు చేయ‌డానికి నిరాక‌రించిన‌ట్లు బాధితురాలు వాపోయారు. పోలీసులు డ‌బ్బుల‌కు అల‌వాటు ప‌డే కేసు న‌మోదు చేయ‌కుండా తాత్సారం చేశార‌ని బాధితురాలు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దానికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. అ అభాగ్య‌రాలి బాధ‌ను వింటున్న వారి మ‌న‌సు క‌లిచివేస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: