మొత్తానికి క్యాబినెట్ సమావేశం పెట్టుకోవటానికి చంద్రబాబునాయుడుకు షరతులతో కూడిన అనుమతొచ్చింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా క్యాబినెట్ సమావేశం పెట్టుకోవాలని చంద్రబాబు పంతం పట్టారు.  ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల కమీషన్ పరిశీలించి సోమవారం సాయంత్రం షరతులతో కూడిన   గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

 

ఫణి తుపాన్, మంచినీటి ఎద్దడి, కరువు, ఉపాధిహామీ పథకంలో జరిగిన పనులపై సమీక్షించాలంటూ చంద్రబాబు పట్టుబట్టారు. అయితే ఈ అంశాలపై క్యాబినెట్ సమావేశం జరపాల్సినంత అవసరం ఏమీ లేకపోయినా ఏదో అడుగుతున్నారు కాబట్టి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుంది. అందుకే ఎటువంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోకూడదని, ఆర్ధిక అంశాలపై నిర్ణయాలుండకూడదనే షరతులు విధించింది కేంద్ర ఎన్నికల సంఘం.

 

నిజానికి చంద్రబాబు క్యాబినెట్ సమావేశం పెట్టాలని అనుకుంటున్నదే పెండింగ్ లో ఉన్న బిల్లులను క్లియర్ చేసుకోవటానికి. ఉపాధిహామీ పథకంలో దాదాపు రూ. 2 వేల కోట్ల బిల్లులు పెండిగ్ లో ఉన్నాయి. అలాగే, పోలవరం ప్రాజెక్టు సభ కాంట్రాక్టర్లకు అందాల్సిన బిల్లులు మరో రూ. 480 కోట్ల వివాదం నడుస్తోంది.  పెండింగ్ లో ఉన్న బిల్లులన్నీ టిడిపి నేతలకు సంబంధించిన కాంట్రాక్టర్లవే కాబట్టి  వాటిని  క్లియర్ చేయించుకోవాలన్నది చంద్రబాబు పట్టుదల. అందుకనే క్యాబినెట్ కోసం అంతలా పట్టుబట్టారు. మరి సీఈసీ షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది కాబట్టి రేపు ఉదయం జరుగనున్న క్యాబినెట్ సమావేశంలో ఏం చర్చిస్తారో చూడాల్సిందే.

 

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: