ఇండియాలో ప్ర‌యాణికుల‌కు మెరుగైన సేవ‌లు అందించ‌డంలో విమాన‌యాన సంస్థ‌లు పోటీ ప‌డుతున్నాయి. 2018-2019 సంవ‌త్స‌రానికి గాను టాప్ లో 11 ఎయిర్‌లైన్స్‌లు నిలిచాయి. టికెట్ల బుకింగ్, ఆఫ‌ర్స్‌, డిస్కంట్స్ , ప్ర‌యాణికుల‌ను సుర‌క్షితంగా వారు కోరుకున్న గ‌మ్య స్థానాల‌కు చేర్చ‌డంతో పాటు మెరుగైన వ‌స‌తి సౌక‌ర్యాల‌ను క‌ల్పించ‌డంలో ముందంజ‌లో ఉంటున్నాయి. ఆయా సంస్థ‌లు న‌డిపే విమానాల‌కు అనువుగా ఉండేలా దేశ‌మంత‌టా ఎయిర్ పోర్ట్స్‌ను కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేసి అభివృద్ధి ప‌రుస్తున్నారు. ప్ర‌పంచంలోనే హైద‌రాబాద్‌లోని జిఎంఆర్ విమానాశ్ర‌యానికి మంచి పేరుంది.

దేశీయ ప్ర‌యాణికుల‌తో పాటు విదేశీ టూరిస్టులు కూడా హైద‌రాబాద్‌ను సంద‌ర్శించేందుకు ఎక్కువ‌గా ప్రిఫ‌ర్ చేస్తున్నారు. ఇటీవ‌ల తెలంగాణ స‌ర్కార్ కొలువు తీరిన‌ప్ప‌టి నుంచి ట్రావెల్ అండ్ టూరిజం ప్యాకేజీల‌ను ఏర్పాటు చేసింది. విమానాశ్ర‌యంలో ల్యాండ్ అయిన‌ప్ప‌టి నుంచి క్యాబ్స్ ఏర్పాటు, హోట‌ళ్ల‌లో దించ‌డం, ఆహారం అందేలా చూడ‌టం, వారు కోరుకున్న సంద‌ర్శ‌న స్థ‌లాల‌ను చూయించ‌డం, వాటి చ‌రిత్ర‌ను గైడ్స్ ద్వారా వివ‌రిస్తున్నారు. 


దీంతో ట్రావెల‌ర్స్ ఈ సిటీ ప‌ట్ల ఎక్కువ మ‌క్కువ పెంచుకుంటున్నారు. మెరుగైన వ‌స‌తుల క‌ల్ప‌న‌, ప్ర‌యాణం చేసేందుకు విమానాల‌ను రెడీగా ఉంచ‌డం, ఈజీగా టికెట్లు , సీట్లు ల‌భించేలా చేయ‌డం , త‌క్కువకే టికెట్ల ధ‌ర‌లు ఉండ‌డం, ల‌గేజీ ఉచితంగా అందించ‌డం, ఆహారం, నీళ్లు, టిఫిన్స్, స్నాక్స్ ఉచితంగా పంపిణీ చేయ‌డం ఇవ‌న్నీ ఆయా ఎయిర్ లైన్స్‌లు ఫాలో అవుతున్నాయి. ప్ర‌యాణికుల‌ను ఆక‌ర్షించేందుకు ప‌డ‌రాని పాట్లు ప‌డుతున్నాయి.

విమానాల నిర్వ‌హ‌ణ లెక్క‌కు మించి బ‌రువుగా మారుతోంది యాజ‌మాన్యాల‌కు. విమాన ప్ర‌యాణం ..ఒక‌ప్పుడు గొప్పోళ్ల‌కు, డ‌బ్బులు ఉన్న‌వారికి, బిజినెస్ ప‌ర్స‌న్స్ కు మాత్ర‌మే అనుకునే వాళ్లు. ఇపుడు ఆ సీన్ మారి పోయింది. పేదోళ్లు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు కూడా ఫ్ల‌యిట్ల‌లో ప్ర‌యాణం చేసేందుకు రెడీ అవుతున్నారు. ఒక‌ప్పుడు భూమి మీదే ఉంటూ వ్య‌వ‌సాయం సాగు చేసుకుంటున్న రైతులు కూడా పొలం సాగు ఎక్కువ‌గా చేసే ఇజ్రాయిల్, ఆస్ట్రేలియా , త‌దిత‌ర దేశాలు ప‌ర్య‌టిస్తున్నారు. 


త‌క్కువ పెట్టుబ‌డితో ఎక్కువ దిగుబ‌డి ఎలా సాధించాలో తెలుసుకుంటున్నారు. మొత్తం మీద ఈసారి ప్ర‌క‌టించిన ఎయిర్ లైన్స్ లు ఇవే. ఎప్ప‌టి లాగే భార‌త ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన ఎయిర్ ఇండియా మొద‌టి స్థానంలో నిలిచింది. రెండో స్థాన‌లో జెట్ ఎయిర్ వేస్ నిలువ‌గా, మూడో స్థానంలో విస్తారా పొందింది. నాలుగో స్థానంలో ఇండిగో ఎయిర్ లైన్స్ ఉండ‌గా..అయిదో స్థానంలో స్పైస్ జెట్ చేరుకుంటే, ఆరో స్థానంలో గో ఎయిర్ ఉంటే, ఏడో స్థానంలో ఎయిర్ ఏసియా ఇండియా , ఎనిమిదో స్థానంలో ట్రూ జెట్, తొమ్మిదో స్థానంలో జూమ్ ఎయిర్ చేజిక్కించుకుంటే ప‌దో స్థానంలో ఎయిర్ ద‌క్క‌న్ ఉండ‌గా 11వ స్థానంలో ఎయిర్ ఒడిశా ఎయిర్ లైన్స్ నిలిచింది.

మొత్తం మీద కొన్ని ఎయిర్ లైన్స్‌లు సంక్షోభం దిశ‌గా ప‌య‌నిస్తుంటే..మ‌రికొన్ని స‌మ‌ర్థ‌వంతంగా ..స‌క్సెస్ ఫుల్‌గా న‌డుస్తున్నాయి. వ‌స‌తుల క‌ల్ప‌న‌లో ప్ర‌థ‌మ శ్రేణిలో ఉంటున్న ఎయిర్ ఇండియా ఇపుడు కొట్టు మిట్టాడుతోంది. ఏది ఏమైనా ..ట్రావెల‌ర్స్ సేఫ్టీ ముఖ్యం. ఆ దిశ‌గా ప‌య‌నిస్తున్న ఎయిర్ లైన్స్ అలాగే ఉండాల‌ని కోరుకుందాం.


మరింత సమాచారం తెలుసుకోండి: