చిరంజీవి సినిమాలు హిట్.. రాజకీయాలు ఫట్... ఈ విషయం తెలిసిందే. కానీ కొత్తగా చిరంజీవి విద్యావ్యాపారంలోకి అడుగుపెడుతున్నాడంటూ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చాలా ప్రచారం జరుగుతోంది. శ్రీకాకుళంలో చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభం కాబోతున్న వార్త కూడా ఆసక్తిరేపింది. 


ఇదంతా నిజమే కానీ.. ఈ విద్య సంస్థలతో మెగాస్టార్ చిరంజీవికి గాని మెగా ఫ్యామిలిలో సబ్యులకు గాని ఎలాంటి సంబంధం లేదట. ఈ విషయాన్ని ఆ  సంస్థ సిఇఓ జె.శ్రీనివాసరావు ఓపత్రికా ప్రకటనలో తెలిపారు. కేవలం అభిమానంతోనే చిరంజీవి పేరును పెట్టుకున్నట్లు చెప్పారు. 

ఈ సంస్థలో చిరంజీవి, రామ్ చరణ్, నాగబాబులను ఫౌండర్, అధ్యక్షుడు, ఛైర్మన్‌లుగా నియమించడానికి కారణం కూడా అదే అంటూ ప్రెస్ నోట్ లో వివరణ ఇచ్చారు. దిగువ మధ్య తరగతి కుటుంబాల పిల్లలకు మెరుగైన విద్యను అందించడమే తమ లక్ష్యమని మెగా అభిమానిగా సేవా దృక్పధంతో ఈ స్కూల్స్ ని స్టార్ట్ చేస్తున్నట్లు వివరణ ఇచ్చారు. 

ఈ స్కూల్స్ లో మెగా అభిమానుల పిల్లలకు కూడా స్కూల్స్ లో ప్రత్యేక రాయితీలు ఇస్తున్నట్లు నిన్నటివరకు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ అలాంటిదేమీ లేదట. మరి తన పేరును ఇలా వాడుకున్నందుకు మెగా ఫ్యామిలీ ఎలా స్పందిస్తుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: