చంద్రబాబు మళ్లీ సమీక్షలు  ప్రారంభించారు. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ కార్యకర్తల పనితీరుపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఓటమిపై క్యాడర్‌ కు క్లారిటీ ఇస్తున్నారా అన్న అనుమానాలు కలిగిస్తున్నాయి. 

ఆయన ఏమన్నారంటే.. 

కర్నూలు జిల్లాలో అన్ని ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తాం. నదుల అనుసందానంతో నీళ్ల సమస్య పరిష్కారం చేశాం.. కుప్పం కన్నా ఎక్కువ పనులు  చేశాం..  ప్రతి నియోజకవర్గంలో..కానీ కుప్పం కన్నా ఓట్లు తక్కువ వస్తున్నాయి..


పనులు తక్కువ చేసిన కుప్పంలో టిడిపికి అధిక ఓట్లు రావడం, ఎక్కువ పనులు జరిగిన మిగిలిన నియోజకవర్గాలలో టిడిపికి తక్కువ ఓట్లు రావడం సరికాదు. దీనిపై అందరూ ఆలోచించాలి, విశ్లేషించాలి, సరిదిద్దుకోవాలి. కుప్పానికి దీటుగా ప్రతి నియోజకవర్గం టిడిపికి ఓట్లలో పోటీపడాలి..

ఇలా సాగింది చంద్రబాబు ప్రసంగం అంటే.. ఏమిటి కర్నూలు జిల్లాలో టీడీపీ పనితీరు అంత మెరుగ్గా లేదనేగా.. కర్నూలు జిల్లాలో టీడీపీకి ఓటమి తప్పదనే కదా. మరి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి చేరికతో మంచి ఊపు వచ్చిన కర్నూలు జిల్లాలోనే పరిస్థితి ఇలా ఉంటే.. మిగిలిన చోట్ల ఎలా ఉంటుంది..?  



మరింత సమాచారం తెలుసుకోండి: