చంద్రబాబు నాయుడు అనుకున్నది సాధించారు. ఎలాగైనా ఎన్నికల ఫలితాల లోపు కేబినెట్ మీటింగ్ పెట్టి తీరాలని ఆయన పంతం పట్టిన సంగతి తెలిసిందే. చివరకు ఎన్నికల సంఘం అందుకు అనుమతి ఇవ్వడంతో మంగళవారం సాయంత్రం మూడు గంటలకు ఈ సమావేశం జరగనుంది.


సీఎంవో రూపొందించిన అజెండాపై సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యం నేతృత్వంలోని స్క్రీనింగ్‌ కమిటీ శుక్రవారం చర్చించి ఈసీకి నివేదిక పంపింది. దీన్ని ఈసీ ఓకే చేసింది. సోమవారం సాయంత్రం ఆదేశాలు జారీ చేసింది. కాకపోతే కండిషన్స్ అప్లయ్ అన్నట్టు కొన్ని షరతులు పెట్టింది. 

ఫొని తుపాను, కరవు, తాగునీటి ఎద్దడి, ఉపాధి హామీ పనులకు నిధుల చెల్లింపు అంశాలపై చర్చించాల్సి ఉన్నందున కేబినెట్‌ భేటీ నిర్వహించాలని చంద్రబాబు పట్టుదలగా ఉన్నారు. ఒకదశలో ఈసీ ఓకే చెప్పకపోతే అధికారులతో సమీక్ష నిర్వహించాలని కూడా ప్లాన్ చేశారు. 

కానీ మొత్తానికి ఈసీ చంద్రబాబుపై దయదలిచింది. కాకపోతే కొన్ని కండీషన్లు పెట్టింది. బకాయల బిల్లులు ఆమోదించకూడదని.. ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకునే పక్షంలో తమకు చెప్పాలని.. మీటింగ్ తర్వాత బ్రీఫింగ్ ఇవ్వకూడదని కొన్ని కండీషన్లు  పెట్టింది. మొత్తానికి చంద్రబాబు కోరిక నెరవేరబోతోందన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: