14 మే 2004.  సరిగ్గా 15 ఏళ్ల క్రితం ఇదే రోజు...వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రోజు కోసం వైఎస్ ఆర్‌ దశాబ్దాల తరబడి ఎదురుచూశారు. సొంత పార్టీలో ఎదిగేందుకు అహర్నిశలు శ్రమించారు. 


సొంత పార్టీలోనే నిత్య అసమ్మతివాదిగా ముద్రపడిన వైఎస్సార్.. ఆ తర్వాత తనను తాను మార్చుకున్నారు. ఫ్యాక్షనిస్టుగా.. ముఠానాయకుడిగా పేరు తెచ్చుకున్న అదే వైఎస్సార్.. ఆ తర్వాత తిరుగులేని ప్రజానాయకుడిగా ఎదిగారు.  అభివృద్ధికి నిర్వచనంగా.. సంక్షేమానికి సంతకంగా నిలిచాడు. 

వైఎస్సార్ ను ఎంతగా విమర్శించేవారైనా సరే.. ఆయన సంక్షేమ పథకాలను మాత్రం ప్రశంసించకుండా ఉండలేరు. సామాన్యుడి శ్రేయస్సే లక్ష్యంగా ఆయన పథకాల రూపకల్పన సాగింది. అధికారం చేపట్టిన తొలి నిమిషాల నుంచి పదవిలోనే మరణించిన ఆఖరి క్షణాల వరకు ఆయన సాగించిన పాలనా పద్ధతులు, రాష్ట్ర ముఖ చిత్రాన్నే మార్చేశాయి. 

అభివృద్ధి–సంక్షేమం జోడు గుర్రాల స్వారీ సాగిన స్వర్ణయుగంగా ఆయన పాలన సాగింది. అర్ధంతరంగా ఆయన తనువు చాలించినా.. పలువురు పాలకులు మారినా.. ఈనాటికీ ఆయన చేసిన పనులే జనం మనోఫలకంపై చెరగని ముద్రలు. జనం నుంచి వచ్చిన నాయకుడు వైయస్‌ఆర్‌. ప్రజల మనస్సుల్లో నమ్మకమైన నాయకుడిగా నిలిచినవాడు వైయస్‌ఆర్‌. 



మరింత సమాచారం తెలుసుకోండి: