హైదరాబాద్‌ లోటస్ పాండ్.. ఇప్పటివరకూ ఇది జగన్ చిరునామా.. ఏపీ ప్రతిపక్షనేత అయినా.. రాష్ట్రం విడిపోయి ఐదేళ్లయినా నిన్నటి వరకూ ఇదే జగన్ కేరాఫ్ అడ్రస్. చివరకు ఎన్నికల ప్రచారంలోనూ జగన్ లోటస్ పాండ్‌కు వచ్చే విశ్రాంతి తీసుకునేవారు. పార్టీ కార్యకలాపాలు కూడా లోటస్ పాండ్ కేంద్రంగానే సాగాయి.


కానీ ఇప్పుడు జగన్ అమరావతికి షిఫ్ట్ అవుతున్నారు. లోటస్ పాండ్ లోని సామగ్రిని ప్యాక్ చేసి అమరావతికి పంపుతున్నారు. ఎన్నికల్లో గెలుపు ఖాయమన్న అంచనాలతో ఉన్న జగన్..  అందుకు ముందుగానే ప్రిపేరవుతుతన్నారు. మే 23 తర్వాత ఇక లోటస్ పాండ్ నివాసం కళ తప్పడం ఖాయంగా కనిపిస్తోంది. 

 మే 21న మంచి ముహూర్తం ఉండడంతో ఆ రోజు నుంచి అమరావతిలోనే ఉండబోతున్నారు జగన్. విజయవాడలోని సొంత నివాసంలో ఆయన నివసించబోతున్నట్లు సమాచారం. ఇకపై అక్కడి నుంచే రాజకీయ కార్యకలాపాలు చేస్తారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

ఇన్నాళ్లూ  వైసీపీపై టీడీపీ నేతలు ఈ అంశంపై విమర్శలు గుప్పించేవారు. హైదరాబాద్‌లో ఉంటూ ఏపీలో రాజకీయాలు చేస్తున్నారని పదే పదే విమర్శలు ఎక్కుపెట్టేవారు. ఏపీలో తాను గెలిచే అవకాశాలున్నాయి కాటట్టి..ఇకపై టీడీపీ నేతలకు విమర్శలు చేసే అవకాశం ఇవ్వకూడదని జగన్ భావిస్తున్నట్టున్నారు. అందుకే లోటస్ పాండ్‌ నుంచి అమరావతికి మకాం మార్చాలని వైఎస్ జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: