ఏపీలో ఇపుడు సర్వేల కంటే కూడా ఓ విషయం ఫలితాల మీద ఉత్కంఠ  రేపుతోంది. సర్వేలు జనం నాడి పట్టుకుంటామని చెబుతాయి. ఏవో శాంపిల్ గా కొన్ని సర్వేలు చేసి మొత్తం అంతా ఇలాగే ఉంటుందని అంచనాకు వస్తాయి. దాని మీద లెక్కలు వేసి ఆ పార్టీ గెలిచిందని చెబుతాయి. ఎందుకంటే కోట్లాదిమంది అభిప్రాయాన్ని ఎవరూ కనుక్కోలేరు కనుక. అయితే సర్వేల కంటే కూడా జనం అభిప్రాయాన్ని  తెలుసుకునే విద్య మరోటి ఉంది.


అది జన నాయకులకు తప్ప వేరెవరికీ అర్ధం కాదు. అప్పట్లో అన్న నందమూరి 1994 ఎన్నికపుడు ఎన్ని సీట్లు మీరు గెలుస్తారని విలేకరులు అడిగితే 220 అని ఠక్కున ఆన్సర్  ఇచ్చారు. దాన్ని మీడియా కూడా నమ్మలేదు. ఎందుకంటే ఆయన గారి పార్టీలో అప్పటికి  లక్ష్మీ పార్వతి ఎపిసోడ్ ఉంది. పైగా అల్లుళ్ళు చంద్రబాబు, దగ్గుబాటి ఇద్దరూ కూడా ఆ ఎన్నికల్లో పార్టీ విజయానికి పెద్దగా క్రుషి చేయలేదు. మొత్తం ఎన్నికల భారాన్ని అన్న గారు లక్ష్మీపార్వతితో కలసి మోశారు.


మరో వైపు కాంగ్రెస్ బలంగా ఉన్నట్లు కనిపించింది. పైగా కేంద్రంలోనూ ఆ పార్టీ ఉండడం, నిధులు ఇతరత్రా ఇబ్బందులు లేకపోవడం, బలమైన నాయకులు కాంగ్రెస్ లో ఎక్కడికక్కడ ఉండడంతో కాంగ్రెస్ గెలుస్తుందని కూడా అనేవారు. చివరికి ఫలితాలు మాత్రం అన్న గారికే అనుకూలంగా వచ్చాయి. అంతే కాదు. ఆయన చెప్పినట్లుగానే 220 కి పైగా సీట్లు దక్కాయి. దీన్ని బట్టి అన్న గారు సర్వేల కంటే జనం గుండె లోతులను చూసి చెప్పారని అనుకోవాలి.


ఇపుడు వైఎస్ జగన్లోనూ అదే  ధీమా కనిపిస్తోంది. జగన్ ఈసారి కచ్చితంగా సీఎం అవుతానని చాలా కాన్-ఫిడెంట్ గా ఉన్నాడు. ఆయనకు అనుకూలంగా పెద్ద ఎత్తున సర్వేలు వస్తున్నాయి. అయితే వాటికిమించి జగన్ నమ్ముకున్నది జనాన్ని,  జగన్ దాదాపుగా 14 నెలలకు పైగా పాదయాత్ర చేశారు.అణువణువూ తిరిగారు. జనం గుండె లోతుల్లో భావాలను ఆయన చదివారు. ఈ కారణంగానే జగన్ ధీమాగా ఉన్నారు. గెలుపుపై పక్కా నమ్మకంతో ఉన్నారనుకోవాలి. ఈ ధీమా అంత సులువుగా రాదు, ప్రజల్లో మమేకం అయిన వారికి మాత్రమే జనం భాష అర్ధమవుతుంది. జగన్ కూడా జనంతో ఉండబట్టే వచ్చేది మెమే అని గట్టిగా  చెప్పబోతున్నారనిపిస్తోంది. చూస్తూంటే అదే జరిగేలా ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: