ప్ర‌స్తుతం తెలుగు మీడియా రంగంలో టీవీ9 న్యూస్ ఛానెల్ గురించి చాలా హాట్ హాట్ చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయ్‌. టీవీ-9 సీఈవో ర‌విప్రకాష్ తొల‌గింపు... కొత్త సీఈవో రావ‌డం లాంటి అంశాల‌తో ఇప్పుడు టీవీ-9 అటు మీడియా, ఇటు రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌కంప‌న‌లు రేపుతోంది. ఇక తాజాగా టీవీ-9 ఆదాయంపై కేర్ రేటింగ్ ఇచ్చిన వివ‌రాలు చూస్తే షాక్ అవ్వాల్సిందే. టీవీ-9 గ్రూప్ వివిధ భాష‌ల్లో వార్తా చాన‌ళ్ల‌ను నిర్వ‌హిస్తోన్న సంగ‌తి తెలిసిందే. టీవీ-9  అసోసియేటెడ్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కంపెనీ (ఏబీసీపీఎల్‌) పేరుతో కార్య‌క‌లాపాలు చేస్తోంది. ఈ గ్రూప్‌న‌కు 2017-18 ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.200 కోట్ల ఆదాయం అర్జించిన‌ట్టు కేర్ రేటింగ్స్ వెల్ల‌డించింది.

ఈ రూ.200 కోట్ల ఆదాయంపై రూ 5.86 కోట్ల నిక‌ర లాభం న‌మోదు చేసింద‌ని కూడా ఈ గ‌ణాంకాలు స్ప‌ష్టం చేశాయ్‌. టీవీ9కు తెలంగాణ‌, క‌ర్ణాట‌క రాష్ట్రాల్లో అత్య‌ధిక ప్ర‌జాదార‌ణ ల‌భించడంతో ఈ ఛానెల్ టాప్ ప్లేస్‌లో ఉంది. ఇక తాజాగా టీవీ-9 వివాదం విష‌యానికి వ‌స్తే గ‌త సంవ‌త్స‌రం ఏబీసీపీఎల్‌లో 90.5 శాతం వాటాల‌ను అలందా మీడియా వాళ్లు కొనుగోలు చేశారు. అయినా 9 శాతం వాటా ఉన్న ర‌విప్ర‌కాష్ సంస్థ‌లో ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తోన్నార‌న్న ఆరోప‌ణ‌ల‌తోనే ఆయ‌న్ను సీఈవో ప్లేస్ నుంచి మార్చిన సంగ‌తి తెలిసిందే.

ఇక ఏబీసీపీఎల్ తీసుకున్న రూ.25 కోట్ల ధీర్ఘ‌కాల రుణాల‌కు కేర్‌ బీబీబీ, స్టేబుల్‌ రేటింగ్‌ ఇచ్చింది. అలాగే రూ.15 కోట్ల స్వల్పకాలిక బ్యాంక్‌ రుణాలకు కేర్‌ ఏ3 రేటింగ్ ఇటీవ‌ల నివేదిక స్ప‌ష్టం చేసింది. ఏదేమైనా టీవీ-9 ప్ర‌స్థానంలో ఎన్నో వివాదాల‌కు, సంచ‌ల‌నాల‌కు కేంద్ర బిందువుగా ఉంది. ఇక తాజా సంఘ‌ట‌న‌తో మ‌రో సారి టీవీ-9 విశ్వ‌స‌నీయ‌త‌, నిర్వ‌హ‌ణ‌పై అనేక సందేహాలు వ‌చ్చినా... టీవీ-9 రేటింగ్‌, నెంబ‌ర్ వ‌న్ పొజిష‌న్‌ను మాత్రం మిగిలిన మీడియా ఛానెల్స్ ట‌చ్ చేయ‌క‌పోవ‌డం విశేష‌మే.



మరింత సమాచారం తెలుసుకోండి: