డ్ర‌గ్స్ కేసు టాలీవుడ్‌ను షేక్ చేసిన విష‌యం అంద‌రికీ తెలిసిన విష‌య‌మే.. ఈ కేసులో సినీ సెల‌బ్రిటీలు నిందితులు కాద‌ని, వారు కేవ‌లం బాధితులేన‌ని సిట్ రిపోర్ట్ పేర్కొంది. న‌గ‌రంలో రెండేళ్ల క్రితం డ్ర‌గ్స్ కేసు టాలీవుడ్‌లో సంచ‌ల‌నం సృష్టించింది. ఈ కేసులో ప‌లువురు హీరోలు, హీరోయిన్లు, ద‌ర్శ‌కులతో పాటు పాఠ‌శాల విద్యార్థులు కూడా డ్ర‌గ్స్ బారిన ప‌డుతున్నార‌ని ఎక్సైజ్ అధికారుల ద‌ర్యాప్తులో తేలిసింది. దీంతో న‌గ‌ర వాసులు ఒక్క‌సారి ఉలిక్కిప‌డ్డారు. 


కానీ అప్ప‌ట్లో దీనిపై ఎక్సైజ్ శాఖ‌  సిట్‌ అధికారులు చాలా డీప్‌గా ద‌ర్యాప్తు చేప‌ట్టారు.  పలువురు సినీ ప్రముఖులను విచారించారు. కానీ, ఆ ఈ  కేసు విష‌యం ఎవ‌రు ప‌ట్టించుకోలేదు. లైట్ గా తీసుకున్నారు.  దీంతో ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ వ్యవస్థాపకులు పద్మనాభరెడ్డి సమాచార హక్కు చట్టం ద్వారా ఈ కేసు వివరాలను సేకరించారు. 


ఈ నేప‌థ్యంలో ఆయ‌న ప‌లు కీల‌క విష‌యాల‌ను పేర్కొన్నారు. డ్రగ్స్‌ కేసులో ఇప్పటి వరకు నాలుగు ఛార్జిషీట్ల దాఖలు చేసినట్లు ఎక్సైజ్‌ అధికారులు వెల్లడించారు. మొత్తం 12 కేసులు నమోదు చేశామని, సినీనటులు, దర్శకులు సహా 62 మందిని విచారించినట్లు తెలిపారు. 


ఈ కేసులో  హీరోలు, హీరోయిన్స్, దర్శకులతో పాటు పలువురు ప్రముఖుల నుండి గోర్లు, వెంట్రుకల నమూనాలను సేకరించిన సిట్ అధికారులు వారి పేర్లను మాత్రం ఛార్జిషీట్‌లో చేర్చలేదని అధికారులు వెల్లడించిన సమాచారం ద్వారా తెలుస్తోంది. 


టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో మొత్తం 12 కేసులను సిట్‌ నమోదు చేసింది. దాఖలైన చార్జిషీట్లలో సినీ సెలబ్రిటీలకు క్లీన్ చిట్ ఇచ్చింది. సిట్ అధికారులు చార్జిషీట్లు దాఖలు చేసిన నాలుగింటిలో ఒకటి సౌత్ ఆఫ్రికా పౌరుడు రఫెల్ అలెక్స్ విక్టర్‌పై ఉంది. ముంబై నుంచి హైదరాబాద్‌కు కొకైన్‌ను తరలించి విక్రయిస్తున్నాడని 2017 ఆగస్టులో అరెస్ట్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: